గ్రహములకు మిత్రులు శత్రువులు సములు అని గ్రహముల మధ్య ఉన్న
భాంధవ్యమును శాస్త్రములలో నిర్వచించిరి . దీని ఉపయోగము మనిషి జీవితములో ఎలా
ఉంటుందో తెలుసుకోవాలంటే ముందు గ్రహముల మధ్య ఉన్న సంబంధమును గురించి తెలుసుకోవాలి .
దీనిలో కూడా శాశ్వతము , తాత్కాలికము అను రెండు విధానములు
ఉన్నవి . శాశ్వత శత్రువు ఒకప్పుడు మిత్రుడుగానూ , శాశ్వత మిత్రుడు ఒక్కొక్కప్పుడు
శత్రువుగాను జాతక చక్రమును బట్టి మారిపోవును . తదనుగుణముగా ఆ గ్రహములు ఇచ్చు
ఫలితములు ఆధారపడి ఉంటాయి . ఇప్పుడు మొదట ఏ గ్రహమునకు ఏ గ్రహము శాశ్వత మిత్రుడు ఏ
గ్రహములు శాశ్వత శత్రువులుగా ఉన్నాయో చూద్దాం . ఈ పట్టికను గురించి తెలుసు కోవడం
వలన జాతక ప్రకారము మరియు సంఖ్యా శాస్త్రము ప్రకారము కూడా ఫలితములు
నిర్ధారించుకోవడానికి ఉపయోగ పడుతుంది .
గ్రహముల మధ్య ఉండే శాశ్వత
మిత్ర శత్రువుల చక్రము
గ్రహముల మధ్య ఉండే సంబంధము అయిదు రకాలుగా ఉంటుంది .
1 అధిమిత్రుడు 2 మిత్రుడు ౩ సముడు 4 శత్రువు 5 అధిశత్రువు
1 . అధిమిత్రుడు : అత్యంత శుభ ఫలితములను లాభాలను కలుగ
చేస్తాడు
2 . మిత్రుడు :: శుభఫలితములను ప్రసాదించును
౩. సముడు :: సమ గ్రహము లాభ నష్టములను, సుఖ దుఃఖము లను సమానముగా ఉంచుతాడు
4 శత్రువు : జరిగే
పరిణామము లన్ని వ్యతిరేఖముగా ఉంటాయి .
5 అది శత్రువు : అత్యంత ప్రతి కూలములైన పరిస్థితులను కలుగ
చేయును .
శాశ్వత చక్రము
గ్రహము
|
మిత్రుడు
|
సముడు
|
శత్రువు
|
సూర్యుడు
|
చంద్ర కుజ గురు
|
బుదుడు
|
శుక్రుడు , శని
|
చంద్రుడు
|
సూర్యుడు బుధుడు
|
కుజ గురు శుక్ర శని
|
|
కుజుడు
|
సూర్య చంద్ర గురు
|
శుక్ర శని
|
బుధుడు
|
బుధుడు
|
సూర్య శుక్ర
|
కుజ గురు శని
|
చంద్రుడు
|
గురుడు
|
సూర్య చంద్ర కుజుడు
|
శని
|
బుధ శుక్ర
|
శుక్రుడు
|
బుధ శని
|
కుజ గురు
|
సూర్యుడు చంద్రుడు
|
శని
|
బుధ శుక్ర
|
గురు
|
సూర్య చంద్ర కుజ
|
No comments:
Post a Comment