2017-04-23

శంఖుస్థాపన

గృహారంభము అనునది మానవుని జన్మతో సమానము .
జన్మించిన దాదిగా మానవునకు  ఈ సృష్టితో అనుబంధము ఉంటుంది ,.
అదే విధముగా పునాది రాయి వేయడం , భూమి పూజ చేయడం లేక శంఖుస్థాపన చేయడం అనేది మంచి సుగుణములు కలిగిన శుభ ముహూర్తములో చేయాలి .
ఆ విధముగా చేసిన గృహము నందుండు వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్య కలుగ చేస్తుంది .
   
గృహ ఆరంభము చేయుటకు మాస ఫలితములు ఈ విధముగా ఉన్నాయి .

శ్లోకం : చైత్రమాసే గృహారంభే ధనధాన్య పశుక్షయం , వైశాఖం శుభదంచైవ , జ్యేష్టాయమరణం
        ఆషాడం కలహం భవేత్ , శ్రావణం శుభదం , భాద్రపదే సదా రోగీ
        ఆశ్వీయుజం కలహం, కార్తీకే శుభదం ప్రోక్తం , మార్గశిర్షే మహాద్భయం
        పుష్యేచా అగ్ని భయంచ ,మాఘేస సంపదా , పాల్ఘునే రత్న లాభః
అని చెప్పితిరి

తాత్పర్యము : చైత్ర మాసమున గృహారంభము చేసినచో ధన నష్టము జరుగును ,వైశాఖ మాసము శుభము , జ్యేష్ట మాసము మరణమును కలుగ జేయును , ఆషాడ మాసమునందు తగవులు ఏర్పడును , శ్రావణము సకల శుభములు ప్రసాదించును , బాద్రపద మాసమునందు అనారోగ్యము కలుగును .,, ఆశ్వీయుజం కలహములు , గృహమునందు ఉండువారికి మనస్సుకు శాంతి కరవగును . కార్తీకము మంచిది . మార్గశిర మాసము భయమును కల్గిస్తుంది . పుష్య మాసము న గృహా రంభము చేయుట వలన అగ్నిచే దహించ బడును . మాఘ మాసము సకల సంపదలు , ఐశ్వర్యము , కలుగుతాయి . ఫాల్గుణ మాసమున చేయుట వలన అనేక విధములుగా అభివృద్ధి కలుగుతుంది .

శంఖు స్థాపనకు పనికి వచ్చే నక్షత్రములు .
ఉత్తర , ఉత్తరాషాడ , ఉత్తరాభాద్ర , రోహిణి , మృగశిర ,చిత్త , ధనిష్ఠ అనూరాధ , రేవతి , స్వాతి , శతభిషం గ్రుహారంభామునకు ప్రశస్తమైన నక్షత్రములు .

బుధ , గురు , శుక్ర వారముల యందు సూర్యోదయమునకు ముందు ౩ నుండి 6 గంటల లోపల గానీ , సూర్యోదయము తరువాత ఉదయం 11 గంటల లోపల గానీ శంఖు స్థాపన ముహూర్తము ఏర్పాటు చేసుకోవలెను

ఈ ముహూర్తము సకల సుగుణములు కలది 4 , 8 , 12 స్థానముల శుద్ది కలిగి వృషభ చక్రశుద్ది, తారాబలము , చంద్రబలము , పంచకరహితములు బాగుగా యున్నది అయి ఉండాలి .

4, , 8 , 12 స్థానములను గురించి ఇంతకుముందు కూడా ప్రస్తావించాను . వీటి గురించి కొంత వివరణ .
4 వ స్థానము సుఖాన్ని సూచిస్తుంది . ఇట్టి ఈ స్థానములో పాప గ్రహములు ఉండుట వలన  గృహము నిర్మాణమైన తరువాత గృహమందు ఉండువారికి సుఖములు లేక అనేక రకాల కష్ట నష్టములు కల్గును .
8 . ఇది ఆయుస్సు ను సూచిస్తుంది . ఇక్కడ శుద్ది లేకపోతె గృహమునందు మరణము కల్గును .
12 ఇది ఖర్చులను , నష్టములను , అపజయములను సూచిస్తుంది . ఈ స్థానము శుద్ది గా ఉండక పొతే గృహ యజమానికి గానీ అందుండు వారికి గానీ అన్నింటా అపజయములు కల్గును. .


No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...