నవ నిధులు , నవ రత్నాలు ,
నవ రసాలు , నవ ధాన్యాలు , నవ గ్రహాలూ ఈ నవ శబ్దంతో సృష్టి ప్రారంభం . సశక్తి
స్వరూపముగా మహాత్మాత్మకముగా కుజుడు ఆధారభూతుడైనాడు .శరీరమునకు ఆధారమైనవి రక్త
మాంసములకు కుజుడే అధిపతి .
సంఖ్యా శాస్త్రము ప్రకారము 9 18 27 తేదీలలో జన్మించిన వారు
కుజుడు యొక్క ఆధీనములో ఉంటారు . వీరికి Lucky Number 9
. వీరు 3
6 9 12 15 18 21 24 27 30 తేదీలలో
పుట్టినవారి యందు అధిక విశ్వాసమును కలిగి ఉంటారు ఆదరాభిమానములను పొందుతారు .
వీరికి మంగళ , గురు , శుక్ర వారములు వాటితో కలసిన పైన చెప్పిన తేదీలు కలసిన రోజులు
అత్యంత అనుకూలముగా ఉంటాయి .
ఈ కుజుడు మార్చి 21 నుండి ఏప్రిల్ 26 వరకు మరియు
అక్టోబర్ 21 నుండి నవంబర్ 27 వరకు గల మధ్య గల కాలములో బలవంతుడు . ఈ కాలములో జన్మించిన వారికి కుజ బలము
అధికముగా ఉంటుంది. ఈ కుజ గ్రహ బలము కలవారు . కార్య సాధకులు . వీరు తక్కువ స్థాయి
నుండి జీవితమును ప్రారంభించి ఉన్నత స్థితికి చేరుతారు . అకుంటిత దీక్ష కలవారు .
సమస్యలతో పోరాడి సాధించుకోగల నీర్పు వీరి సొంతము . ధైర్య సాహసములు అధికముగా ఉంటాయి
.
వీరు ఇతరులకు లోబడి ఉండుటకు
ఇష్టపడరు. ముక్కు మీద కోపం ఉంటుంది. తన కోపం వలన కొన్నిసార్లు ఇబ్బందుల పాలగుదురు .
పంతాలు పట్టింపులు ఎక్కువ . సహనము తక్కువగా ఉంటుంది . వీరు ఇతరుల చేతిలో తొందరగా
మోసపోతారు . తాము మోస పోయినట్లు గ్రహించినచో వారిని వదలి పెట్టరు. పైకి కర్కశముగా కన్పింతురు , గానీ వీరెంతో దయార్ద్ర్హ
హృదయము కలవారు. కొంచెం అహంభావం కూడా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మంచి చెడుల
విచక్షణ మరచి ప్రవర్తిస్తారు . ఇది వీరికున్న లోపము .
Favorable color Red . Favorable area
South . సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట వలన మేలు కలుగును.
కుజ గ్రహ ఆధీనము గల జాతకులకు శరీరము పై స్పోటకపు మచ్చలు , గాయాలు దెబ్బలు లేక
కాలిన మచ్చలు కలిగి ఉంటారు . దైవభక్తీ ఎక్కువగా ఉంటుంది . మనోబలము కలిగి ఉంటారు. శరీరములో
కొంత వ్యాధి లక్షణములు ఉంటాయి . 18 20 22 27 30 45 50 సంవత్సరములలో operations జరగే అవకాశములు ఉంటాయి . 18 27 29
36 38 45 48 54 56 సంవత్సరములు వీరికి కలసి
వస్తాయి . అనేకరకముల లాభాలు కలుగుతాయి .
జీవితములో సమస్త సుఖములను
అనుభవిస్తారు . పట్టుదల అధికము కార్య నిర్వహణలో ఎక్కవ శ్రద్ధ కలిగి సమర్ధతతో
సాధించ గలరు. వీరితో విరోధము పెట్టుకొనుట మంచిది కాదు . వినయ విధేయతలు చూపెవారి
పట్ల మంచి ఆదరణ చూపిస్తారు .
No comments:
Post a Comment