2014-01-09

వ్యాయామం

మన పూర్వీకులు సూచించిన జీవన విధానములో అనేక రకముల  ఆరోగ్య రహస్యములు,  మానవ సంబంధాలు దాగి ఉన్నాయి . ప్రస్తుత కాలములో సామాజిక సంబంధాలు దెబ్బతిన్నాయి . పక్కింటి వారికి ఏమి జరుగుతుందో , ఎలా ఉంటున్నారో కూడా తెలియడం లేదు . అసలు బాహ్య పరమైన హలో, హాయ్ లాంటి పదాలతో పలకరింపులే తప్ప సామాజిక ఐక్యత లోపించింది అనే చెప్పాలి . ఒక వీధిలో ఒకే ఊరిలో నివసిస్తూ ఉన్న మనుషుల మధ్య కూడా సత్సంబంధాలు ఉండడం లేదు . ఎదుటి వారి కష్టాలలో , సమస్యలలో పాలుపంచుకోవడము, వారికి మానసిక స్థైర్యాన్ని కలగచేయడం ఒకరికొకరు వెన్ను దన్నుగా ఉండడం లాంటి సందర్భాలు లేవు .   

ఇప్పుడు ప్రతి విషయము కమర్షియల్ అయిపొయింది . మార్కెట్ లో ఉచితంగా దొరికే వస్తువులను, ఉచితముగా ఆచరించే పద్దతులను కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవలసి ఉంటుంది . తిరిగి ఆ డబ్బును సంపాదించుట కొరకు ఆరాటపడడం ఎక్కువై పోయింది . ఏమంటే బిజీ ప్రపంచం లో పోటీపడక పొతే వెనుకబడి పోతామనే కహానీలు కూడా ఎక్కువై పోయాయి . ఇంతా చేసి మనిషి ఏమి అనుభవిస్తున్నాడు అని ఆలోచించుకుంటే అది శూన్యమనే చెప్పాల్సిన కాలము కూడా వస్తుంది .

ఇక్కడ చిన్న ఉదాహరణ చూద్దాం . పూర్వము గ్రామాలలో ఊరి మధ్యలో బావులు ఉండేవి . నుయ్యి దగ్గర చేరినప్పుడు అందరూ ఒకరికొకరు ఆప్యాయంగా పలకరింపులు , ఊరిలోఒకరి సమాచారమును ఒకరు తెలుసుకోవడం , యోగ క్షేమాలను అడిగి తెలుసు కోవడం జరిగేది .  ఊరిలో ఉండే వారందరూ ఆ బావిలో ఉన్న నీటినే స్నానాలకు , వంటకు వాడుకునే వారు . ఆ నీరు తెచ్చుకోవడానికి  మగవారు కావిడితో తెచ్చేవారు , ఆడవాళ్ళు బిందెలతో తలపై పెట్టుకుని మోసుకోచ్చేవారు .

దీనివలన వ్యాయామం మనకు తెలియకుండా చేస్తున్నాము . Wacking చేస్తున్నాము . మన పనులు మనమే చేసుకుంటున్నాం. ముఖ్యముగా ఆడవారు తలపై ఒకదానిపై ఒకటి చొప్పున మూడు బిందెలను కూడా పెట్టుకొని చేతులతో పట్టుకోకుండా Balance చేస్తూ నీటిని తెచ్చేవారు . దీనివలన శరీరములో కొవ్వు పెరగదు . మెడ , తల కు సంబంధింఛి Exercise జరుగుతుంది .. తలపోటు , తల నొప్పి అనే రోగాలు చాలా తక్కువ మందికి వచ్చేవి . తలపై చుండ్రు లాంటివి నశించడం , జుట్టు పెరగడం పొడవైన కురులతో ఉండేవారు. 

మరి ఇప్పుడో 20  సంవత్సరాలు దాటిన వయసుకే నూటికి 50 శాతం మందికి  ప్యాషన్ అనో తల నొప్పి అనో లేకపోతె సైటు అనో కళ్ళజోళ్ళు వాడాల్సిన అవసరం వస్తుంది . ఎవరికీ మూరెడు జుట్టుకు మించి పొడవైన జుట్టు ఉండడం లేదు . ముఖ్యముగా సామాజిక సంబంధాలు అసలేలేవు . ఆనాడు మన పెద్దలు సూచించిన విధానములో రూపాయి ఖర్చులేదు . మరి ఈనాడో మన వసరాలకు water  కొరకు motors వాడుచున్నాము .

దానికి current ఖర్చు. Current bill, శరీరములో జబ్బులు పెరుగుచున్నాయి . medicine  ఖర్చు . జిమ్ లేక వ్యాయామ శాలకు వెళితే వారికి ఫీజులు . ఇవన్నీ కలసి నెల వచ్చే సరికి డబ్బు అవసరం కాబట్టి మిగతావి ఏవి వద్దు డబ్బు సంపాదనే నా మొదటి లక్ష్యం అనే పద్దతిలో ప్రస్తుత సమాజము నడుస్తూ ఉంది ..  

హిందూ సంప్రదాయంలో ప్రతిరోజు స్త్రీలు ఉదయం ఇళ్ళముందు ముగ్గులు వేస్తారు.ముగ్గులు వేయడం వలన  ఆరోగ్యకారణాలున్నాయి.శరీరంలో నడుము భాగానికి తగిన వ్యాయామం లేకపోతే అది దీర్ఘకాలంలో అనేకానేక వెన్ను సమస్యలకు దారి తీస్తుంది. రాత్రంతా పడుకున్న సమయంలో వెన్ను నిటారుగా ఉంటుంది. ఉదయం లేవగానే నడుముకు సంబంధించిన వ్యాయామం చేయడం సత్ఫలితాలనిస్తుందని గమనించారు పెద్దలు. నడుముకు సంబంధించిన వ్యాయామంలో భాగమే స్త్రీలు ముగ్గువేయడం..                                      

ముగ్గులు వేయాలంటే నడుమువంచాలి. చుక్కలు పెడతారు, అవి కలపడానికి అటు, ఇటు చేతులు, నడుము కదపాలి. ఈ విధంగా నడుముకు సంబంధించిన వ్యాయమం చేసినవారవుతారు. దీని కారణంగా దీర్ఘకాలంలో నడుము నొప్పులు రావు. అందుకే ఉదయమే ముగ్గులు వేయడం మన సంప్రదాయంలో భాగంగా పెట్టారు.

ఈనాటి కాలంలో ఒక్కసారి గమనిస్తే, మనమూ, మన పిల్లలు కూడా శరీరంలో అన్ని భాగాలకు తగిన వ్యాయామం అందివ్వడంలేదు. పిల్లలు పొద్దున బడికి వెళ్తే, ఏ రాత్రో ఇంటికి వస్తున్న రోజులివి. ఇంట్లో సౌకర్యాలు అన్ని ఉండడం వల్ల అసలు నడుము ఒంచి పని చేసే అవకాశం ఉండడంలేదు. ఇది దీర్ఘకాలంలో వెన్నుపూసకు సంబంధించిన రుగ్మతలను కారణం అవుతుంది. వారు ఆ కాలంలో ఆలోచించి వాడుకలోకి తెచ్చిన ఈ సంప్రదాయం ఈ కాలం వారికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? పెయింట్లు పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నాం.

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...