2014-02-23

షడ్గుణములు- గ్రహ ప్రభావము

మానవుడు షడ్గుణములచే ప్రభావితమగును . షడ్గుణములను జయించువాడు పురుషోత్తముడు , ఉత్తమ పురుషుడుగా ప్రసిధ్ధిగాంచును. షడ్గుణములనబడు కామ, క్రోధ, లోభ, మోహ,మద, మాత్సర్యము అనబడే ఆరు గుణములచే దుర్గతి పాలగును. ఈ షడ్గుణములు కు జాతకుడు లోనగుటకు గల కారణములు ఏమిటి. ఏ గ్రహముల స్థితి వలన దురలవాట్లకు బానిస అగుచున్నాడు అను విషయములను గురించి తెలుసుకుందాం ?
జాతక చక్రములొ ఉన్న గ్రహముల స్థితిని అనుసరించి జాతకునకు ఉండే దురలవాట్లను తెలుసుకోవచ్చును .

మానవుని ఆలోచనలను ప్రభావితము చేసే గ్రహము చంద్రుడు. చంద్రుడు మనస్సుకు కారకుడు . ఈ చంద్రుని స్థితి వలన జాతకుని ఆలొచనలలో మార్పులు సంభవించును.చంద్రుడే ఆలోచనలపై ప్రభావమును చూపును. చంద్రునిపై ఉన్న ఇతర గ్రహముల ప్రభావమును బట్టి పైన తెలిపిన గుణములకు ఆకర్సింపబడును.

కామమునకు ,మోహము,  మాత్సర్యములకు శుక్రుడు కారకుడు,
 క్రోధమునకు కుజుడు కారకుడు,
 మదమునకు రవి కారకుడు ,
 లోభమునకు శని కారకుడు.

శుక్రుడు నీచ స్థితిని పొందినా పాపగ్రహముల ప్రభావమునకు లోనై చంద్రునితో సంభంధము కలిగినచో స్త్రీలపై మక్కువ ఎక్కువ , కామ వాంచ అధికము. చపల మనసు కలిగి ఉండుట, వ్యసనము నకు లోనగుదురు. వీటికి రాహు గ్రహ సంభంధము కలిగితే వావి వరసలు మరచి ప్రవర్తింతురు.

కుజుడు నీచను పొందినా పాపగ్రహముల ప్రభావమునకు లోనైనా  విపరీతమైన కోపము కలిగి ఉండును.
అదే విధముగా రవి గ్రహము బలహీనమై ఉన్నప్పుడు  అహంకారపూరితముగా వ్యవహరించుట జరుగును.
శని గ్రహము స్థితి చెడినప్పుడు తొందరగా ఎవ్వరినీ నమ్మరు . వీరికి ఇతరులపై నమ్మకము తక్కువ. ప్రతి విషయములో లోభి తనము ఉంటుంది. పశు ప్రవృత్తి కలుగును

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...