2014-02-19

సంధి వివరణ

సాధారణముగా జాతకమును పరిశీలించేటప్పుడు మరియు ముహోర్తమును లెక్క వేయునపుడు సంధిని గురించి ప్రస్తావన వస్తుంది.ఈ సంధులలో అనేక రకముల తేడాలు ఉంటాయి. ముందుగా సంధి అంటే ఎమిటీ అనే విషయములను తెలుసుకుందాం.సంధి అంటే రెండు విషయముల మధ్య , లేక రెండు సంఘటనల మధ్య ఉండే సమయమును తెలియ పరచునది.

దీనిలో అనేక రకములు ఉన్నవి.

1 తిధి సంధి 2 నక్షత్ర సంధి 3 రాశీ సంధి 4 లగ్న సంధి
రెండు తిధుల మధ్య వుండే కొంత సమయమును తిధి సంధి అంటారు .
అలాగే రెండు నక్షత్రముల మధ్యన ఉండే సమయాన్ని నక్షత్ర సంధి అంటారు.
అలాగే రెండు రాశుల మధ్యన, రెండు లగ్నముల మధ్యన ఉండే సమయాన్ని కూడా సంధి గానే లెక్కించడం జరుగుతుంది.

తిధులు, నక్షత్రములు , రాశులు , లగ్నములు మధ్య అటు ఇటు సుమారు 12 నిమిషములు సంధి ఉండును.
ముఖ్యముగా ఈ సంధి సమయము ఎలాంటి శుభ కార్యములు నిర్వహించుటకు పనికిరాదు . మరియు ఈ సన్ధి సమయములలో జన్మించిన వారికి పూర్ణాయుర్ధాయము ఉండదు.


సంధికి సంబంధించి మనకు పురాణములలో ఒక కధ ఉన్నది .
హిరణ్యకసిపుడు ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మనుండి వరము పొందుతాడు.
తనకు కత్తి చేత గానీ , కర్ర చేత గానీ , మనుష్యుల వలన గానీ , జంతువుల వలన గానీ దేవతల వలన గానీ, రాక్షసుల చేత గానీ , ఆయుధముల వలన గానీ , ఇంట గానీ , బయట గానీ , పగలు గానీ , రాత్రి గానీ చావు కలుగ కూడదు అని వరాన్ని పొందుతాడు. ఆతని అకృత్యములకు శిక్షించాలని వైకుంట వాసుడైన శ్రీహరి నరసింహ అవతారమెత్తి అతనిని సంహరించాడు.


హిరణ్య కసిపుని సంహరించిన సమయము పగలు రాత్రి గానీ సూర్యాస్తమయము జరిగె సమయము.
సంహరించిన ప్రదేశము ద్వారము పై అనగా ఇంటా కాదు , బయటా కాదు.
సంహరించిన అవతారము నృసింహ అవతారము అనగా పూర్తిగా జంతువు కాదు అలాగనీ మనిషీ కాదు.
దీనిని బట్టి మనకు అర్ధమగుచున్నది .

సంధి అనగా సంబంధిత తిధి నక్షత్రము రాశులకు ఎ ఒక్క దానికి చెంది పరిపూర్ణ ఫలితమును ఇవ్వజాలదు. 

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...