2017-06-28

గృహ నిర్మాణ స్థలము

1 . గృహము నిర్మించ బోయే స్థలము ఎట్లు ఉండాలి .
గృహము నిర్మించ దలచిన స్థలము చతురస్రముగా గాని , దీర్ఘ చతురస్రముగా గానీ ఉండాలి . గట్టిగా ఉన్న స్థలములు అనువైనవి . ఎత్తైన నేలలు మంచివి .

2. గృహ నిర్మాణమునకు పనికిరాని  స్థలములు ?
త్రికోణ ఆకారము, డైమండ్ ఆకారము , కోణములు ఎక్కువ , తక్కువ ఉన్న స్థలములు , వృత్తా కారముగా ఉన్నవి , మెత్తటి నేలలు, విదిక్కులకు తిరిగి ఉన్న స్థలములు, ఉబుకు నేలలు, గుల్ల నేలలు గృహ నిర్మాణము నకు పనికిరావు . 

గృహము నిర్మించబోయే వారు మొదట స్థల పరిశీలన జరిపించాలి . ఎవరైనా ఇంజనీరును గానీ , సిద్ధాంతిని గానీ సంప్రదించి  దిక్సూచి ని ఉపయోగించి దిక్కులకు సరిపోయే విధంగా స్థలాన్ని చతురస్రముగా లేక దీర్ఘ చతురస్రముగా మార్కింగు చేయించాలి . తదుపరి ఆ స్థలం చుట్టూ ప్రహారి నిర్మించాలి .

 గట్టివి , కంకర నేలలు అయితే మంచిదే . కానీ ఈ కాలములో అందరికి అనువైన స్థలములు దొరకుట కష్టము .అలాంటివారు ఇసుక నేలలు, మెత్తటి నేలలు, ఉబుకు నేలలు మరి ఇతర నేలలు ఉన్నప్పుడు గృహనిర్మాణము చేయ దలిస్తే ముందుగా స్థలమును ఆరడుగుల లోతు వరకు తవ్వి మట్టిని తీసేయాలి . వ్యవసాయ భూమి లో మట్టితో గానీ , కంకరతో నింపాలి . ఈ విధముగా చేయుట వలన ఇంటి యొక్క అడుగు భాగము గట్టిగా ఉంటుంది . మరియు వాస్తు ప్రకారము కూడా మంచిది .

గృహ నిర్మాణ కర్త ఒక మంచి శుభ ముహూర్తము ఏర్పాటు చేసుకొని శంఖుస్థాపన చేయాలి .దీనినే గృహారంభము అంటారు . గృహారంభ ముహూర్త విశేషములు ఈ విధంగా ఉన్నాయి .

గృహారంభ ముహూర్తము నకు వృషభ చక్రశుద్ది ,4, 8 , 12 స్థానముల శుద్ది ముఖ్యముగా చూడాలి .
వృషభ చక్రము :సూర్యడు ఉన్న నక్షత్రము నుండి ముహూర్తము పెట్టుకొన్న రోజున ఉన్న నక్షత్రము వరకు లెక్కించగా వచ్చు సంఖ్యను బట్టి ఫలితములు ఇలా ఉంటాయి .

సూరుడున్న నక్షత్రము నుండి మొదటి 1, 2 ,౩ నక్షత్రములు మృత్యువు ను కల్గించును , 4 . 5 , 6 ,7 నక్షత్రములు చెడుకాలము{ దుర్దశ }, 8 ,9 , 10 ,11 ధైర్యమును కల్గించును , 12, 13 ,  14 భ్రమణము{ ఇక్కడ భ్రమణము అంటే సంచారము ) ను, 15 , 16 , 17 ,18  ధనమును ప్రసాదించును . 19, 20 , 21 ,22 ధాన్య సంపదను 23 , 24 , 25 సంపద వృద్ధి జరుగును 26 , 27 , 28 పశు వృద్ధి జరుగును .

ఈ విధముగా వృషభ చక్రఫలితములు తెలుసుకొని చక్కని ముహూర్తము నిర్ణయము చేసుకొని గృహ నిర్మాణము ఆరంభించాలి .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...