2014-01-17

మీకు తెలుసా ?

ఆయువు , ధనము , ఇంటిగుట్టు , మంత్రం , ఔషధం ,స్త్రీ సంబంధం , దానం , మానం మొదలగు విషయములను పైకి చెప్పకూడదు ..

విడచిన బాణం గడచిన క్షణం , ఒలికిన పాలు వీటిని గూర్చి చింతించుట వలన ప్రయోజనం ఉండదు .

బ్రహ్మచర్యమును ఆచరించని వాడు సమాజమునకు మార్గదర్శి కాలేడు .

ఆశకు దాసులైతే అందరికి దాసులౌతారు

ఆశయే దాసీ అయితే ( ఆశలు అదుపులో ఉంటె ) లోకమే దాసోహం అవుతుంది .

పిలవని పేరంటానికి వెళ్ళకూడదు .

యజ్న యాగాదులు దైవ సంబంధ కార్యాలకు పిలవక పోయినా వెళ్ళవచ్చు

రుద్రాక్ష మాలతో జపం చేస్తే ధర్మార్ధ మోక్షాలు కలుగుతాయి

స్ఫటిక మాలతో జపం చేస్తే సర్వాభీష్టములు సిద్దించును

పగడము మాలా ధారణ వలన విద్యాభివృద్ధి , వశీకరణము కలుగును

యంత్రము ఇచ్చాశక్తి  చిహ్నము . మంత్రము జ్ఞాన శక్తికి సంకేతం తంత్రము క్రియాశక్తికి మూలము 
.
రుద్రాక్షలను ధరించుట వలన గుండెదడ , మధుమేహము వంటి రోగములు తగ్గును 

2014-01-12

స్వామి వివేకానంద

వివేకానందుడు ఈనాటి సమాజానికి ముఖ్యముగా యువతకు ఆదర్సప్రాయుడు . వందేళ్ళ క్రితమే యువశక్తిని గుర్తిన్చిన దార్శనికుడు . అతడొక స్పూర్తి ప్రదాత . మార్గదర్శి . గురువు. దీరోదాత్తుడు .

యువతకు మార్గ నిర్దేశకుడు . మనిషిలో  దాగివున్న అచంచలమైన శక్తిని గుర్తించిన మహనీయుడు . భారత దేశ కీర్తిని దశ దిశల చాటి చెప్పిన మహా మనిషి . బాల్యములోనే లోకాన్ని  చదివి మనలో ఆత్మ విశ్వాసము నింపిన గొప్ప మేధావి . భారతీయ సంస్కృతి సంప్రదాయములను ప్రపంచం నలుమూలలా విస్తరింప చేసి ప్రపంచ మానవాళికి సత్యాన్ని బోధించిన ఆధ్యాత్మిక గురువు . ఆయన బోధనలు నేటి మానవాళికి ఏంతో స్పూర్తిదాయకం .

ఆయన మాటలు ఈనాటి యువతకు శక్తిని , ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తాయి . మనిషిగా తన కర్తవ్యాన్ని బోధిస్తాయి భారతదేశం అభివృద్ధిలో మార్పు తేగల సత్తా యువశక్తిలో ఉన్నదని అదే ప్రపంచానికి మార్గాన్ని చూపగలదని బోధించిన తత్వవేత్త .

లక్ష్యము లేకుండా వెళ్లేవారికి ఆయన బోధనలు ఒకమార్గాన్ని చూపిస్తాయనడంలో సందేహం లేదు .   
SWAMI VIVEKANANDA   SWAMI VIVEKANANDA SLOGANS

2014-01-11

Number 9

9 వ సంఖ్య : సంఖ్యలలో ఇది పరిపూర్ణ సంఖ్య . ఇది  భాగ్యమును కూడా తెలియ పరుస్తుంది . అభివృద్దిని తెలిపే సంఖ్య . ఏ సంఖ్యతో గుణించినా చివరికి వచ్చే ఫలితమును మొత్తాన్ని కలిపితే తొమ్మిదే అవుతుంది . అదే దీని ప్రత్యేకత అంతే ఏది ఏమైనా తన వ్యక్తిత్వాన్ని , పూర్ణత్వాన్ని కోల్పోకుండా ఉంటుంది . ఒకటి నుండి తొమ్మిది వరకు ఉన్న సంఖ్యల మొత్తమును కలిపినా తొమ్మిదే అవుతుంది .

నవ నిధులు , నవ రత్నాలు , నవ రసాలు , నవ ధాన్యాలు , నవ గ్రహాలూ ఈ నవ శబ్దంతో సృష్టి ప్రారంభం . సశక్తి స్వరూపముగా మహాత్మాత్మకముగా కుజుడు ఆధారభూతుడైనాడు .శరీరమునకు ఆధారమైనవి రక్త మాంసములకు కుజుడే అధిపతి .

సంఖ్యా శాస్త్రము ప్రకారము 9 18 27 తేదీలలో జన్మించిన వారు కుజుడు యొక్క ఆధీనములో ఉంటారు . వీరికి Lucky Number 9 . వీరు  3  6  9  12 15 18 21 24 27 30  తేదీలలో పుట్టినవారి యందు అధిక విశ్వాసమును కలిగి ఉంటారు ఆదరాభిమానములను పొందుతారు . వీరికి మంగళ , గురు , శుక్ర వారములు వాటితో కలసిన పైన చెప్పిన తేదీలు కలసిన రోజులు అత్యంత అనుకూలముగా ఉంటాయి .

ఈ కుజుడు మార్చి 21 నుండి ఏప్రిల్  26 వరకు మరియు అక్టోబర్  21 నుండి నవంబర్  27 వరకు గల మధ్య గల కాలములో బలవంతుడు . ఈ కాలములో జన్మించిన వారికి కుజ బలము అధికముగా ఉంటుంది. ఈ కుజ గ్రహ బలము కలవారు . కార్య సాధకులు . వీరు తక్కువ స్థాయి నుండి జీవితమును ప్రారంభించి ఉన్నత స్థితికి చేరుతారు . అకుంటిత దీక్ష కలవారు . సమస్యలతో పోరాడి సాధించుకోగల నీర్పు వీరి సొంతము . ధైర్య సాహసములు అధికముగా ఉంటాయి .

వీరు ఇతరులకు లోబడి ఉండుటకు ఇష్టపడరు. ముక్కు మీద కోపం ఉంటుంది. తన కోపం వలన కొన్నిసార్లు ఇబ్బందుల పాలగుదురు . పంతాలు పట్టింపులు ఎక్కువ . సహనము తక్కువగా ఉంటుంది . వీరు ఇతరుల చేతిలో తొందరగా మోసపోతారు . తాము మోస పోయినట్లు గ్రహించినచో వారిని వదలి పెట్టరు.  పైకి కర్కశముగా కన్పింతురు , గానీ వీరెంతో దయార్ద్ర్హ హృదయము కలవారు. కొంచెం అహంభావం కూడా ఉంటుంది. కోపం వచ్చినప్పుడు మంచి చెడుల విచక్షణ మరచి ప్రవర్తిస్తారు . ఇది వీరికున్న లోపము .

Favorable color Red . Favorable area South . సుబ్రహ్మణ్య ఆరాధన చేయుట వలన మేలు కలుగును. కుజ గ్రహ ఆధీనము గల జాతకులకు శరీరము పై స్పోటకపు మచ్చలు , గాయాలు దెబ్బలు లేక కాలిన మచ్చలు కలిగి ఉంటారు . దైవభక్తీ ఎక్కువగా ఉంటుంది . మనోబలము కలిగి ఉంటారు. శరీరములో కొంత వ్యాధి లక్షణములు ఉంటాయి . 18 20 22 27 30 45 50 సంవత్సరములలో operations జరగే అవకాశములు ఉంటాయి . 18 27 29 36 38 45 48 54 56 సంవత్సరములు వీరికి కలసి వస్తాయి . అనేకరకముల లాభాలు కలుగుతాయి .

జీవితములో సమస్త సుఖములను అనుభవిస్తారు . పట్టుదల అధికము కార్య నిర్వహణలో ఎక్కవ శ్రద్ధ కలిగి సమర్ధతతో సాధించ గలరు. వీరితో విరోధము పెట్టుకొనుట మంచిది కాదు . వినయ విధేయతలు చూపెవారి పట్ల మంచి ఆదరణ చూపిస్తారు .    

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...