2014-06-09

కుజదోషము - గురుని అనుగ్రహము

కుజ దోషము వలన వివాహ సంబంధ విషయము లలో మానవునకు అనేక విధములుగా సమస్యలు ఎదురగు చున్నవి . అందరి జాతకము ల లోనూ  కుజుడు ఉంటాడు . ప్రాధమికంగా జాతక పరిశీలన చేసి నపుడు కుజ దోషం ప్రతి వంద  మంది లో సుమారు ఎనభై మందికి ఉంటుంది . అలా అని ప్రతి ఒక్కరికి సమస్యలు ఎదురగుట లేదు.

మరి ఈ కుజ దోషము ను గురించి మహర్షులు ఇంత లోతుగా ఎందుకు  అధ్యయనము చేసి యున్నారు .
 ఎందువలన అంటే కుజుడు దోష స్థానములో ఉన్నప్పటికీ  గురు గ్రహము యొక్క కలయిక గానీ , దృష్టి గానీ ఉన్నప్పుడు మరియు కుటుంబ స్థానము , కళత్ర స్థానము శుభప్రదము గా ఉన్నప్పుడు కుజుని దోష తీవ్రత తగ్గి దంపతులు సుఖ జీవనము గడుపుతారని మహర్షుల చే చెప్ప బడినది .

కుజుడు ముఖ్యము గా సంసార జీవితము లో సమస్యలను సృష్టించును . అలా అని కుజుడే లేకపోతే మానవునకు సంసార వాంఛ ఉండదు . 
ఉదా : పొయ్యి పై ఒక పాత్రలో నీటిని పోసి మరగించి నపుడు ఆవిరి అవుతుంది .నీరు రూపాంతరము చెందింది . 

మానవ శరీరములో కామమునకు శుక్రుడు ఆధిపత్యము వహించును . ఇక్కడ శరీరములో నిద్రాణమై ఉన్న కోరిక ను రగిల్చే వాడు కుజుడు .  కుజుడు ప్రభావము వలన కోరిక కలిగి సంసార సుఖము ను అనుభవింతురు . తద్వారా జీవి ఉత్పత్తి జరుగుతుంది . అనగా పిల్లలు పుడతారు . ఈ విధముగా సృష్టి లో మానవుని  ఉత్పత్తి జరుగుట కు మూల కారకుడు కుజుడు.  .

కుజుడు మరియు శుక్ర గ్రహములు  సరియైన స్థితి లో ఉండవలెను . అట్లు లేని యెడల కామ వాంఛ  ఎక్కువగా ఉండును . ఒక్కొక్కప్పుడు ఈ విధమైన గ్రహ స్థితులు బాగుగా లేనివారు వ్యభిచారులు , మరియు దుష్ప్రవర్త న కలిగి ఉంటారు . అట్లు ఉండుట వలన కుటుంబ మర్యాద గంగ లో కలసి పోవును . భార్యా భర్త మధ్య స్పర్ధలు ఏర్పడి దాంపత్యము ముక్కలగును 

గురుడు బుద్ధికి , జ్ఞానము నకు కారకుడు , ఈయన వైద్యుని తో సమానము , జబ్బు చేసిన మానవుని  తిరిగి నయం చేసి ఆరోగ్య వంతుడిగా చేయగల శక్తి వైద్యునకు ఏ విధంగా ఉంటుందో , అదే విధంగా  కుజుడు వలన కలుగు దుష్ప్రవర్తన , దురాలోచనలను , దూరం చేసి మానవునకు వివేకాన్ని , బుద్ధిని , జ్ఞానాన్ని ప్రసాదించి సత్ప్రవర్తన తో నడచునట్లు చేయును .

2014-05-20

10 వ తరగతి తరువాత

రాబోయేది పరీక్షల కాలం . 10 వ తరగతి పరీక్ష రాసే విద్యార్ధుల తల్లి దండ్రులకు అనేక సందేహాలు కలుగుతూ ఉంటాయి ?

తమ పిల్లల భవిష్యత్తు కొరకు తరువాత ఏంచెయ్యాలి ? ఏ గ్రూపును తీసుకోవాలి . ఐ . టి. ఐ , పాలిటెక్నిక్ , ఇంటర్ మొదలగు వాటిలో ఏది చదివించాలి అనే సందేహం కలుగుతుంది . చాలా మంది ఎవరో ఏదో చెప్పారని తమ స్వంత ఆలోచనలకు భిన్నంగా వ్యవహరించడం జరుగుతుంది . తమ స్నేహితుల పిల్లలో లేక తెలిసిన వారి పిల్లలో పలానా కాలేజీలో జాయిన్ అయ్యారనో , ఫలానా గ్రూపు తీసుకున్నారనో ఇతరులను అనుసరిస్తూ ఉంటారు . అలా చేయకూడదు .

విద్యార్ధికి ఏ ఏ సబ్జెక్ట్స్ పై అవగాహన ఉన్నది . వారికి ఏ రంగముల అభిరుచి ఉన్నది , విద్యార్ధి సామర్ధ్యమునకు సరిపోతుందా అనే విషయములను పరిగణన లోకి తీసుకోవాలి . విద్యార్ధి ఎంచుకునే కోర్సుకు భవిష్యత్తులో ఉన్న అవకాశములేమిటి . తదుపరి పై చదువులకు వెళ్ళడానికి ఉన్న అవకాశములు ఎలా ఉంటాయి . మన ఆర్ధిక స్తోమత ఎంత . ఇలా అన్ని విషయములను బేరీజు వేసుకొని ఖచ్చితమైన నిర్ణయము తీసుకోవాలి . ఎందుకంటే మీరు వేయబోయే అడుగు , తీసుకునే నిర్ణయము విద్యార్ధి భవిష్యత్తుకు పునాది లాంటిది .

Good News For Andhra pradesh Students
2014-2015 RGUKT IIIT   ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ వెలువడినది .
వివరములకు ఈ దిగువ వెబ్ సైటు లో చూడండి .

http://admissions2014.rgukt.in/

for Notification in Telugu Please click this Link
RGUKT IIIT NoTIFICATION

2014-05-10

త్రిశాంశ – ఫలితములు

జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ మేష వృశ్చిక రాశులు అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారి ప్రవర్తన సరిగా ఉండదు . శీలము చెడినవారు .
శని త్రిశాంశ యందు పుట్టినవారు దాసీ వృత్తి వలన జీవించెదరు .
గురు త్రిశాంశ లో జన్మించిన వారు మంచి సత్ప్రవరణ కలిగి ఉంటారు .స్త్రీ లైతే ప్రతివ్రత అగుదురు .
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు మాయోపాయములచే బ్రతుకుతారు .
శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు దురాచార సంప్రదాయములను కలిగి ఉంటారు .   

జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ వృషభ , తులా  రాశులు అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారు ఇతరులచే నిందలు పడువారు , దూషించ బడిన వారగుదురు ..
శని త్రిశాంశ యందు పుట్టినవారు రెండు వివాహములు జరుగును .
గురు త్రిశాంశ లో జన్మించిన వారు సద్గుణములు కలవారు  అగుదురు .
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు సమయానుకూల నిర్ణయములు చేయువారు , సంగీతాది విద్యలు తెలిసిన వారగుదురు. .శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు మంచి శీలము కలవారు.  గుణవంతులు , బుద్ది మంతులు అవుతారు.

జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ మిధున , కన్య రాశులు అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారు గౌరవ మర్యాదలు పొందువారు .
శని త్రిశాంశ యందు పుట్టినవారు నపుంసకులు అవుతారు .( అనగా సంసారమునకు పనికి రారు ).
గురు త్రిశాంశ లో జన్మించిన వారు మంచి సత్ప్రవరణ కలిగి ఉంటారు .స్త్రీ లైతే ప్రతివ్రత అగుదురు .
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు గుణవంతులు , విద్యా వినయ సంపన్నులై ఉంటారు . .
శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు కామ స్వభావము  ఎక్కువగా కలిగి ఉంటారు . దుష్ప్రవర్తన కలవారు .    

జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ ధనుస్సు , మీన రాశులు అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారు సద్గుణములు కలిగి , సదా సంచార వృత్తిని కలిగి ఉంటారు ..
శని త్రిశాంశ యందు పుట్టినవారు సంసార సుఖము పై విముఖత చూపిస్తారు , కోరికలు తక్కువగా ఉంటాయి . .
గురు త్రిశాంశ లో జన్మించిన వారు మంచి సత్ప్రవరణ కలిగి ఉంటారు .భార్య ,భర్తల ప్రేమాభిమానములు కలిగి ఉంటారు.
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు శాస్త్ర జ్ఞానము కలవారు. రచనా వృత్తి చే  బ్రతుకుతారు .
శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు భార్యా భర్తల మధ్య ఎడబాటు కలుగును  .   

జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ  మకర కుంభ రాశులు అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారు సేవకా వృత్తిచే జీవించువారు.  .
శని త్రిశాంశ యందు పుట్టినవారు నీచ జనుల సాంగత్యము కలుగుతుంది ..
గురు త్రిశాంశ లో జన్మించిన వారు మంచి సత్ప్రవరణ కలిగి ఉంటారు .స్త్రీ లైతే ప్రతివ్రత అగుదురు .
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు కోపము ఎక్కువ జీవిత భాగస్వామికి విలువ నివ్వరు . .
శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు చంచల మనస్సు కలవారు. సంతాన నష్టము కలుగును . .

జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ కర్కాటక రాశి  అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారు భార్యా భర్తలు ఇరువురకు ఒకరంటే ఒకరికి పడదు ..
శని త్రిశాంశ యందు పుట్టినవారు దంపతులలో ఒకరికి మరణము కలుగును. క్రూర మనస్సు కలవారు ..
గురు త్రిశాంశ లో జన్మించిన వారు మంచి సత్ప్రవరణ కలిగి ఉంటారు .పుత్ర సంతానము కలుగుతుంది.  .
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు కళా నైపుణ్యము కలవారు . కళా రంగమున రాణిస్తారు .
శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు కాముకులు , వ్యభిచారులు అవుతారు . దుష్ప్రవర్తన కలవారు .    


జన్మ లగ్నము గానీ జన్మ రాశి గానీ సింహ రాశి  అయితే


కుజ త్రిశాంశ లో పుట్టిన వారు మాయా మోస స్వభావము కలవారు. శీలవంతులు కారు .
శని త్రిశాంశ యందు పుట్టినవారు వ్యభిచారము చేయువారు . చరిత్ర హీనులు ..
గురు త్రిశాంశ లో జన్మించిన వారు గొప్ప అధికారము చేపట్టువారు . రాజసమాన భోగములను అనుభవింతురు ..
బుధ త్రిశాంశ లో పుట్టిన వారు భయము లేనివారు ,సంస్కార హీనులు ,చెడ్డ పనులు చేయుదురు .. .
శుక్ర త్రిశాంశ లో పుట్టిన వారు పెండ్లాడిన వారిని విడచి అన్యులను చేపడతారు .  

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...