2017-04-23

శంఖుస్థాపన

గృహారంభము అనునది మానవుని జన్మతో సమానము .
జన్మించిన దాదిగా మానవునకు  ఈ సృష్టితో అనుబంధము ఉంటుంది ,.
అదే విధముగా పునాది రాయి వేయడం , భూమి పూజ చేయడం లేక శంఖుస్థాపన చేయడం అనేది మంచి సుగుణములు కలిగిన శుభ ముహూర్తములో చేయాలి .
ఆ విధముగా చేసిన గృహము నందుండు వారికి సకల ఆయురారోగ్య ఐశ్వర్య కలుగ చేస్తుంది .
   
గృహ ఆరంభము చేయుటకు మాస ఫలితములు ఈ విధముగా ఉన్నాయి .

శ్లోకం : చైత్రమాసే గృహారంభే ధనధాన్య పశుక్షయం , వైశాఖం శుభదంచైవ , జ్యేష్టాయమరణం
        ఆషాడం కలహం భవేత్ , శ్రావణం శుభదం , భాద్రపదే సదా రోగీ
        ఆశ్వీయుజం కలహం, కార్తీకే శుభదం ప్రోక్తం , మార్గశిర్షే మహాద్భయం
        పుష్యేచా అగ్ని భయంచ ,మాఘేస సంపదా , పాల్ఘునే రత్న లాభః
అని చెప్పితిరి

తాత్పర్యము : చైత్ర మాసమున గృహారంభము చేసినచో ధన నష్టము జరుగును ,వైశాఖ మాసము శుభము , జ్యేష్ట మాసము మరణమును కలుగ జేయును , ఆషాడ మాసమునందు తగవులు ఏర్పడును , శ్రావణము సకల శుభములు ప్రసాదించును , బాద్రపద మాసమునందు అనారోగ్యము కలుగును .,, ఆశ్వీయుజం కలహములు , గృహమునందు ఉండువారికి మనస్సుకు శాంతి కరవగును . కార్తీకము మంచిది . మార్గశిర మాసము భయమును కల్గిస్తుంది . పుష్య మాసము న గృహా రంభము చేయుట వలన అగ్నిచే దహించ బడును . మాఘ మాసము సకల సంపదలు , ఐశ్వర్యము , కలుగుతాయి . ఫాల్గుణ మాసమున చేయుట వలన అనేక విధములుగా అభివృద్ధి కలుగుతుంది .

శంఖు స్థాపనకు పనికి వచ్చే నక్షత్రములు .
ఉత్తర , ఉత్తరాషాడ , ఉత్తరాభాద్ర , రోహిణి , మృగశిర ,చిత్త , ధనిష్ఠ అనూరాధ , రేవతి , స్వాతి , శతభిషం గ్రుహారంభామునకు ప్రశస్తమైన నక్షత్రములు .

బుధ , గురు , శుక్ర వారముల యందు సూర్యోదయమునకు ముందు ౩ నుండి 6 గంటల లోపల గానీ , సూర్యోదయము తరువాత ఉదయం 11 గంటల లోపల గానీ శంఖు స్థాపన ముహూర్తము ఏర్పాటు చేసుకోవలెను

ఈ ముహూర్తము సకల సుగుణములు కలది 4 , 8 , 12 స్థానముల శుద్ది కలిగి వృషభ చక్రశుద్ది, తారాబలము , చంద్రబలము , పంచకరహితములు బాగుగా యున్నది అయి ఉండాలి .

4, , 8 , 12 స్థానములను గురించి ఇంతకుముందు కూడా ప్రస్తావించాను . వీటి గురించి కొంత వివరణ .
4 వ స్థానము సుఖాన్ని సూచిస్తుంది . ఇట్టి ఈ స్థానములో పాప గ్రహములు ఉండుట వలన  గృహము నిర్మాణమైన తరువాత గృహమందు ఉండువారికి సుఖములు లేక అనేక రకాల కష్ట నష్టములు కల్గును .
8 . ఇది ఆయుస్సు ను సూచిస్తుంది . ఇక్కడ శుద్ది లేకపోతె గృహమునందు మరణము కల్గును .
12 ఇది ఖర్చులను , నష్టములను , అపజయములను సూచిస్తుంది . ఈ స్థానము శుద్ది గా ఉండక పొతే గృహ యజమానికి గానీ అందుండు వారికి గానీ అన్నింటా అపజయములు కల్గును. .


2017-04-18

సూర్యుడు మరియు రాహు , కేతు

సూర్యుడు మరియు రాహు , కేతు గ్రహముల స్థితి బాగున్న జాతకులను గురించి
జాతక చక్రములో సూర్యునికి , రాహువుకు , కేతువుకు 10 వ భావ అధిపతి కి సంబంధం బాగున్న జాతకులు వైద్య వృత్తిని చేపడతారు . తద్వారా విశేష పేరు ప్రఖ్యాతలు గడిస్తారు . అయితే వైద్య వృత్తికి సంబంధించి పైన తెలిపిన గ్రహములను గురించే కాకుండా ఇంకా అనేక విధములుగా పరిశీలించ వలసిన అవసరము ఉన్నది .


1 లగ్నాధిపతి తో గానీ లగ్నముతో గానీ 10 వ భావము సూర్యుడు , రాహువు సంబంధం ఉంటే జనరల్ సర్జన్ గానీ, హృద్రోగ నిపుణులు  అవుతారు .
2 రెండవ భావ అధిపతి తో ఈ గ్రహముల సంబంధము ఏర్పడితే దంత వైద్య నిపుణులు కాగలరు .
౩ మూడవ భావాధిపతి సంబంధము కల్గితే చెవి , ముక్కు , కన్ను కు సంబంధించిన వైద్యులు కాగలరు .

4 నాల్గవ భావ సంబంధము లో ఉంటే ప్రేగులు , కడుపుకు సంబంధించిన వైద్య విభాగములో ప్రవీణులు కాగలరు .
5 ఐదవ భావముతో పై గ్రహముల వీక్షణ గానీ , కలయిక గానీ , పరివర్తన కలిగితే ప్రసూతి వైద్యులుగా రాణిస్తారు .
6 ఆరవ భావ సంబంధములో ఉంటే కిడ్నీలు , వెన్నెముక కు సంబంధించిన విభాగములో వైద్య వృత్తిని చేపడతారు 7 ఏడవ భావము తో గ్రహముల సంబంధము ఉన్నప్పుడు స్త్రీ వైద్య నిపుణులు కాగలరు . సంఘములో ప్రజలకు సేవ చేయుచు గొప్ప ప్రజాదరణ పొందగలరు .
కేతు సంబంధములో ఉన్నపుడు స్కిన్ స్పెషలిస్ట్ కాగలరు .

ఈ విధముగా గ్రహ బలములు బాగున్నప్పుడు పైన తెలిపిన విభాగములలో వృత్తిని చేపట్టుట యే కాక ఆయా రంగములలో శాస్త్ర పరిశోధనలు చేయ గలరు .

సూర్యుడు మరియు రాహు కేతు గ్రహములు బలహీనముగా ఉన్నవారు , మోస గుణము కలిగి ఉంటారు , మోస పూరిత వ్యవహారములు నడుపుతారు . అన్యాయము , అక్రమాలు చేయుటకు వెనుకాడరు .సంఘ వ్యతిరేక పనులకు పాల్పడడం , దొంగ వ్యాపారములు , చీకటి వ్యాపారములు , లిక్కర్ మొదలగు మత్తు పదార్ధముల వ్యాపారము లు చేయుదురు .

సూర్యుడు మరియు రాహు , కేతు గ్రహములు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు గానీ 10 డిగ్రీల కన్నా తక్కువ దూరములో ఉన్నప్పుడు గానీ పుట్టిన వారు అసాంఘిక కార్యక్రమములకు పాల్పడుట యే కాక ప్రభుత్వము వారిచే శిక్షించ బడతారు . పోలీసు కేసులు , కోర్టు శిక్షలు , జరిమానాలు ఎదుర్కొంటారు  
 

జప విధానము

1 ఇతరులకు వినపడేటట్లు చేసే జపము . దీనిని వాచకమని అందురు
2 ఇతరులకు వినపడి వినపడనట్లు చేస్తే దానిని ఉపాంశువు అని అంటారు .
౩ మనసులో జపిస్తే అది మానసికమని అనబడును .

ఆసన ప్రాధాన్యత
దర్భాసనం వేసుకొని దానిపై తెల్లని వస్త్రమును వేసుకొని జపం చేయుట శ్రేయస్కరం .
పీటపైన జపం చేయుట మంచిది కాదు . పీటపైన వస్త్రం వేసుకొని జపం చేయుట శ్రేష్టము .


ఓం కారం జపిస్తే          -         ఆయురారోగ్య ఐశ్వర్యములు కలుగుతాయి
గాయత్రి  జపిస్తే           -           భుక్తి , ముక్తి లభిస్తుంది .
దామోదరనామం         -           సమస్త బంధనములు తొలగిపోవును
నారాయణ మంత్రం       -           సర్వార్ధ సాధకం
పుష్కరాక్రమ                -           నేత్ర వ్యాధులు నశించును
చక్ర,                        -           సర్వ రోగములు నశించును
నృసింహ నామము      -           స్థైర్యము లభించును .
హయగ్రీవ                  -           విద్యాభి వృద్ది కలుగును
జగత్సూతి                 -           సంతాన ప్రాప్తి
జలాశయ                  -           అగ్ని దాహం తొలగును .

అనంత , అచ్యుత నామములు జపించుట వలన ధన , ధాన్య వృద్ది కలుగును .

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...