విద్యావంతుడు అనగా జ్ఞానము కలవాడు . మంచి
విద్యావంతుడైన మానవుడు సమాజములో గానీ లేక దేశములో గానీ గొప్ప గౌరవ మర్యాదలు పొందుచూ
ఉన్నతమైన జీవితమును గడుపును .
అన్ని ధనముల కన్నా విద్యా ధనము గొప్పది .
విద్య అనునది అనన్య మైనది . అంతులేనిది . మానవుని జీవితమునకు దిశానిర్దేశము చేసేది
విద్య. విద్య వెలకట్టలేని తరగని సంపద వంటిది . అట్టి ‘’విద్య లేనివాడు వింత పశువు’’ అని పెద్దలు
చెప్పినారు .
విద్యారంభమునకు మూలము అక్షర స్వీకారము (
అక్షరాభ్యాసం ) గ్రహాలలో బుధ గురు శుక్ర గ్రహములు శుభ గ్రహములు . మరియు బృహస్పతి
దేవతలకు గురువని, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువని మన పురాణాలు ద్వారా
తెలియుచున్నది . గురుడు జ్ఞానమునకు
కారకుడని గురు బలము బాగున్న విద్యార్ధులు ఏక సంధాగ్రాహులు అవుతారని జ్యోతిష్య
శాస్త్రము ద్వారా తెలియు చున్నది .
అక్షరాభ్యాసము ౩ లేక 5 వ సంవత్సరములలో
జరిపించ వలెను హస్త , పునర్వసు , స్వాతి , అనూరాధ , రేవతి , అశ్విని , చిత్త ,
శ్రవణం నక్షత్రములలో , సోమ , బుధ , గురు , శుక్ర వారముల యందు తదియ , పంచమి ,
సప్తమి , దశమి , ఏకాదశి , ద్వాదశి , త్రయోదశి తిధులలో
శుభ గ్రహ లగ్నముల యందు 4 8 9 భావములు శుద్ది కలిగిన జరిపించాలి .
గురు మూడమి, శుక్ర మూడమి ఉన్న కాలములలో
అక్షరాభ్యాసం చేయించ కూడదు .
శ్రీ పంచమి( వసంత పంచమి , మాఘ పంచమి ) ,
విజయ దశమి తిధుల యందు అక్షరాభ్యాసము చేయించ వచ్చును .ఉత్తరాయణములో మాఘ , పాల్గుణ , వైశాఖ మాసములలో అక్షరాభ్యాసము చేయించుట ప్రశస్తమని చెప్పితిరి కానీ దక్షిణాయనము శ్రావణ , ఆశ్వీయుజ , కార్తీక మార్గశిర మాసములలో కూడా చేయించ వచ్చును .
No comments:
Post a Comment