పై చార్ట్ లో గ్రహముల కక్ష్యలను గురించి చూపించడం జరిగింది . మన జ్యోతిష్య శాస్త్రజ్ఞులు చెప్పినట్లు 7 గ్రహముల ను ఉదహరించాను .
జ్యోతిష్య శాస్త్ర వేత్తలు భూమిని గ్రహము గా సూచించలేదు . మన జ్యోతిష్య విధానము ప్రకారము తొమ్మిది గ్రహములు ఉన్నవి . పైన తెలిపిన గ్రహములలో భూమిని మినహా యిస్తే 7 గ్రహములే యున్నవి . మిగతా రెండు గ్రహముల సంగతి ఏమిటి ? అని ఆలోచించి నపుడు మనకు కాస్త సంశయము కలుగుతుంది . దీనికోసం తెలుసుకోవాలంటే మనం లోతుగా శాస్త్ర పరిశోధన చేయుటయే కాక మహర్షుల చే చెప్పబడిన నిగూఢ మైన విషయములను అర్ధం చేసుకోవలసిన అవసరము ఉన్నది .
ఉదాహరణకు
సూర్యుడు , చంద్రుడు - మండల గ్రహములు అని
కుజుడు , బుధుడు , గురుడు , శుక్రుడు మరియు శనిగ్రహము - తారా (స్టార్ ) గ్రహములు
రాహువు , కేతువు - ఛాయా గ్రహములని సూచించినారు . {చాయ అనగా నీడ అని అర్ధము }.
సౌర కుటుంబము అంతటిని 360 డిగ్రిలుగా విభజించి 12 రాశులు గా నిర్ణయించినారు .. .
సూర్య గ్రహణం అమావాస్య రోజు పగటి పూట ఏర్పడుతుంది.
చంద్ర గ్రహణం పౌర్ణమి రోజు రాత్రి పూట ఏర్పడుతుంది .
No comments:
Post a Comment