జాతకము లో సూర్యుడు
, బుధుడు ఈ రెండు గ్రహముల మధ్య మంచి సంబంధము ఏర్పడి పదవ స్థాన అధిపతి కూడా
మంచి స్థితి కలిగి ఉన్నవారు వ్యాపారములో సమర్ధులు కాగలరు . డబ్బు సంపాదించుట లో
నేర్పరులై ఉందురు . సమయస్పూర్తి కలవారు . మేధావులు . ఆడాయమును , ఖర్చులను బేరీజు
వేసుకొంటారు .
వీరు ఆర్ధిక వ్యవహారములు నడుపుట యందు చాలా
తెలివిగా ఉంటారు . ఈ కాంబినేషన్ ఉన్నవారు పెద్ద ఆర్ధిక సంస్థలలో ఉన్నత పదవులను
పొందుతారు . మనీ మార్కెట్ , ట్రేడింగ్ సంబంధిత రంగములలో , షేర్ మార్కెట్ ,
బ్యాంకులు మొదలగు వాటిలో స్థిరపడతారు .
ప్రతి విషయమును వ్యాపార దృష్టితో చూస్తారు. ట్రెజరీ
విభాగములు , ఆర్ధిక మంత్రులు , చిట్ ఫండ్స్ , పోస్టల్ ఏజంట్లు , మార్కెటింగ్ శాఖలు
, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు , ఎస్టిమేటర్స్ , మొదలగు వృత్తులను చేపట్టు వారు అందరూ
ఈ గ్రహముల ఆధిపత్యము వారే . ఈ గ్రహముల ఆధిపత్యము , బలముల ప్రభావము ఎక్కువగా
ఉన్నవారు . ఉన్నత స్థితులను , గ్రహ బలము లేనివారు సాధారణ స్థాయి కలిగిన జీవనమును
పొందుతారు .
సూర్యుడు – గురుడు . ఈ కాంబినేషన్ లో కర్మ భావ అధిపతి సంబంధము కలిగి ఉన్న జాతకులు
ఆధ్యాత్మిక , సంస్థలలో , దేవాలయాలలో, ఉన్నత పదవులను పొందుతారు . ఆచార సంప్రదాయముల పట్ల
ప్రగాఢ నమ్మకము కలిగి ఉంటారు . సమాజము లో గౌరవ మర్యాదలు పొందుటయే కాక వీరు
ప్రత్యేకత కలిగి ఉంటారు.
దేవాదాయ , ధర్మాదాయ శాఖలలో, విద్యా సంస్థలలో ఉన్నత
ఉద్యోగము కలవారు . ప్రచార కార్యకర్తలు ,
ప్రసంగము చేయు వృత్తులలో అనగా న్యూస్ రీడర్స్ ,
వార్తా పత్రికలు , జర్నలిస్టులు , మొదలగు సమాచార శాఖల యందు గొప్ప అధికారములను
చేపట్ట గలరు . వీరు పదిమందికి ఆదర్శము గా ఉంటారు .ఈ కాంబినేషన్ బలముగా ఉన్నవారు
మాట వలన బ్రతుకు జీవనము కలిగి ఉందురు . అనగా ఉపాధ్యాయులు , లెక్చరర్స్ , మొదలగు
వృత్తులలో విశేషముగా రాణించగలరు . పెద్ద పెద్ద విద్యా సంస్థలను స్థాపించడం .
విద్యకొరకు ఎక్కువగా కృషి చేయడం , జ్ఞాన భోధ చేయడం లాంటి అనేక విషయములలో
ముందుంటారు .
చరిత్ర సృష్టించ గలరు . మత ప్రచార కర్తలుగా
రాణిస్తారు . వీరికి జ్ఞాపక శక్తి ఎక్కువగా ఉంటుంది . భారీ సంస్థలలో సలహాదారులుగా
అధికారములను పొందగలరు . న్యాయ బద్దంగా నడుచుకొంటారు . ప్రభుత్వ సంబంధ శాఖలలో
నామినేట్ చేయబడతారు . గొప్ప గొప్ప సన్మానములను, బిరుదులు పొందుతారు .
ఈ గ్రహముల స్థితి ఉత్తమము గా ఉన్నవారు . డబ్బు కు
ఎక్కువ విలువ ఇవ్వరు . సంఘ సంస్కర్తలు కాగలరు . తాము బ్రతుకుచూ ఇతరులకు బ్రతుకు
చూపించ గల మేధాశక్తి వీరి సొంతము. గ్రహము బలము తక్కువగా ఉన్నవారు పైన తెలిపిన
సంస్థలలో సాధారణ ఉద్యోగమును పొందుట గానీ సాధారణ జీవితము గడుపుట గానీ కలుగును .
వీరి జీవితము మొత్తం మీద ఎప్పుడూ హుందాగా . గౌరవముగా సాగుతుంది .
No comments:
Post a Comment