2013-08-29

అక్షరాభ్యాసము



విద్యావంతుడు అనగా జ్ఞానము కలవాడు . మంచి విద్యావంతుడైన మానవుడు సమాజములో గానీ లేక దేశములో గానీ గొప్ప గౌరవ మర్యాదలు పొందుచూ ఉన్నతమైన జీవితమును గడుపును .

అన్ని ధనముల కన్నా విద్యా ధనము గొప్పది . విద్య అనునది అనన్య మైనది . అంతులేనిది . మానవుని జీవితమునకు దిశానిర్దేశము చేసేది విద్య. విద్య వెలకట్టలేని తరగని సంపద వంటిది . అట్టి ‘’విద్య లేనివాడు వింత పశువు’’ అని పెద్దలు చెప్పినారు . 

విద్యారంభమునకు మూలము అక్షర స్వీకారము ( అక్షరాభ్యాసం ) గ్రహాలలో బుధ గురు శుక్ర గ్రహములు శుభ గ్రహములు . మరియు బృహస్పతి దేవతలకు గురువని, శుక్రాచార్యుడు రాక్షసులకు గురువని మన పురాణాలు ద్వారా తెలియుచున్నది . గురుడు  జ్ఞానమునకు కారకుడని గురు బలము బాగున్న విద్యార్ధులు ఏక సంధాగ్రాహులు అవుతారని జ్యోతిష్య శాస్త్రము ద్వారా తెలియు చున్నది .   

అక్షరాభ్యాసము ౩ లేక 5 వ సంవత్సరములలో జరిపించ వలెను హస్త , పునర్వసు , స్వాతి , అనూరాధ , రేవతి , అశ్విని , చిత్త , శ్రవణం నక్షత్రములలో , సోమ , బుధ , గురు , శుక్ర వారముల యందు తదియ , పంచమి , సప్తమి , దశమి , ఏకాదశి , ద్వాదశి , త్రయోదశి   తిధులలో శుభ గ్రహ లగ్నముల యందు 4 8 9 భావములు శుద్ది కలిగిన జరిపించాలి .

గురు మూడమి, శుక్ర మూడమి ఉన్న కాలములలో అక్షరాభ్యాసం చేయించ కూడదు .
శ్రీ పంచమి( వసంత పంచమి , మాఘ పంచమి ) , విజయ దశమి తిధుల యందు అక్షరాభ్యాసము చేయించ వచ్చును .ఉత్తరాయణములో మాఘ , పాల్గుణ , వైశాఖ మాసములలో  అక్షరాభ్యాసము చేయించుట ప్రశస్తమని చెప్పితిరి కానీ దక్షిణాయనము శ్రావణ , ఆశ్వీయుజ , కార్తీక మార్గశిర మాసములలో కూడా చేయించ వచ్చును .    

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...