2017-08-21

పంచ మహా పురుష యోగములు - 5 Lucky Yogasరుచక మహా పురుష యోగము
జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానము లలో  కుజుడు స్వక్షేత్రము న గానీ, ఉచ్చ స్థానము లో గానీ ఉన్నప్పుడు  రుచక యోగము ఏర్పడును . ఇటువంటి యోగములో పుట్టిన వారు ఉన్నత పదవులను పొందెదరు. అధికారులు అగుదురు , సైన్యాధ్యకులు గా సైన్యమునకు ఆధిపత్యము వహింతురు విద్యుత్తు రంగములో పెను మార్పులను తీసుకు రాగలరు . రక్షణ శాఖల యందు , ఇంజనీరింగు శాఖల లోను , ఉన్నత అధికారమును పొందుతారు .
పెద్ద , పెద్ద వైద్యులు గా పేరు పొందుటయే కాక శస్త్ర చికిత్స నిపుణులు గా పేరు గాంచెదరు .

భద్ర మహా పురుష యోగము
జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానము లలో బుధుడు  స్వక్షేత్రము న గానీ, ఉచ్చ స్థానము లో గానీ ఉన్నప్పుడు భద్ర యోగము ఏర్పడును .ఇట్టి యోగమున జన్మించిన మానవులు గణిత శాస్త్రము నందు మేధావులు , ఆర్ధిక శాస్త్ర నిపుణులు అగుదురు .వీరు బ్యాంకుల యందును , ఆర్ధిక సంస్థల లోనూ ఉన్నత పదవులు అలంకరింతురు. . పండితులుగా రాణింతురు. పూజ్యత , ధన సమృద్ధి కలిగినవారు  .

హంస మహా పురుష యోగము
జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానము లలో  గురుడు స్వక్షేత్రము న గానీ, ఉచ్చ స్థానము లో గానీ ఉన్నప్పుడు హంస యోగము ఏర్పడును . ఇలాంటి యోగమున  పుట్టిన మానవులు , దయా గుణము కలవారు, ధర్మ స్వభావము కలవారు , పండితులు , పరోపకారము చేయువారు . రాబోయే తరాల వారికి కలుగు మేలును గురించి నూతన విషయములను కనిపెట్టువారు , దైవత్వము కలవారు ,గొప్ప అధికారము కలిగి ఉన్నత స్థానములను పొందుదురు .

మాలవ్య మహా పురుష యోగము
జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానము లలో  శుక్రుడు స్వక్షేత్రము న గానీ, ఉచ్చ స్థానము లో గానీ ఉన్నప్పుడు  మాలవ్య యోగము ఏర్పడును . ఈ యోగములో పుట్టిన వారు కళా రంగమును అభి వృద్ది చేయువారు , గొప్ప కళాకారులుగా పేరు సంపాదింతురు. మంచి గృహ యోగము కలిగి సర్వ సుఖములు అనుభవింతురు . భోగములు అనుభవించు వారు ఆభరణ ప్రేమికులు , మృదు స్వభావి ,, సంగీత , సాహిత్య రంగములలో , నటనా రంగములలో విశేష గుర్తింపు పొందెదరు .

శశ మహా పురుష యోగము
జన్మ లగ్నము నుండి కేంద్ర స్థానము లలో శని స్వక్షేత్రము న గానీ, ఉచ్చ స్థానము లో గానీ ఉన్నప్పుడు  శశ  యోగము ఏర్పడును .  ఇటువంటి యోగమున జన్మించిన మానవులు సాధారణ కుటుంబము లో జన్మించిన వారైనా జీవితములో అత్యునత స్థాయిని పొంద గలరు . వీరు స్వయం శక్తి తో ఉన్నత శిఖరము లను అధిరోహించెదరు .ఇట్టి వారు రాజకీయము లందు రాణింతురు. ఈ యోగ ప్రభావముచే ఉహించని విధంగా ఉన్నత పదవీ యోగము కలుగును . వీరు విశేష ధనమును పొంది భోగ భాగ్యములను అనుభవింతురు . పెద్ద పెద్ద పరిశ్రమలను స్థాపించి వ్యాపార వేత్తలుగానూ ,విశేష  కీర్తిని సంపాదిస్తారు.
  

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...