2 వ ఇంట శుక్రుడున్న జాతకులకు శుక్రుడు స్వక్షేత్ర స్థితిలో ఉండుట వలన ధనమునకు ఎప్పుడు ఇబ్బంది ఉండదు. వీరికి అనేక విధముల ధన ప్రాప్తి కలుగును . కుటుంబము వృద్ధి చెందును . సౌమ్యముగా మాతలాడుచూ ఇతరులను ఆకర్షిస్తారు .వీరికి కుటుంబములో ప్రత్యెక గౌరవము ఉంటుంది .
౩ వ స్థానములో శుక్రుడు ఉండుట వలన అక్క చెల్లెలు పట్ల ఆప్యాయత కలిగి ఉంటారు . కొంచెం బిడియము సిగ్గు కలవారు. వీరు సభా పిరికి కలవారవుతారు .
4 వ భావము నందు శుక్రుడున్న జాతకులు మంచి గృహ సౌఖ్యము కలవారు . స్త్రీలన్న గౌరవము . గృహము ఎల్లప్పుడూ సంతోషముగా , అందముగా ఉండే విధముగా చూసుకుంటారు .మాతృ సౌఖ్యము కలవారు . సూక్మ పరిశీలన శక్తి కలిగి ఉంటారు .
పంచమ స్థితిలో ఉన్న శుక్రుని ప్రభావము వలన బుద్ది మంతులై తెలివి కలిగిన సంతానము కలుగుతుంది . కానీ ఎక్కువగా స్త్రీ సంతతి కలుగు అవకాశమున్నది .
ఆరవ స్థానము నందు ఉన్న శుక్రుని ప్రభావము వలన జాతకునికి ముఖ సంభంద రోగములు కలుగును . వీరికి దంతములు సంభందించిన వ్యాధులతో గానీ , నేత్రములకు సంభందించిన రోగములతో గానీ భాద పడతారు . భార్య భర్తల మధ్య సయోధ్య ఉండదు .
No comments:
Post a Comment