లగ్నము నందు కుజుడున్న జాతకులు శౌర్య పరాక్రమములు కలవారు , ఓపిక సహనము
తక్కువ . కొద్దిగా కోపస్వభావము ,చిరాకు కలిగి ఉందురు . వీరి శరీరము ఉష్ణ స్వభావము
కలిగి ఉండును . సన్నగా ఉంటారు . ఎర్రని శరీర చాయ కలిగి , క్షత్రియ లక్షణము కలిగి
ఉంటారు .
2 వ ఇంట అనగా వృషభము లో కుజుడున్న జాతకులకు భూముల వలన , వ్యవసాయము,
పంటల ద్వారా ధన యోగము కలుగును . తాత , ముత్తాత ల ఆస్తులు , వారసత్వ ఆస్తులు కలసి
వచ్చును . అట్లు లేకుండిన జాతకులు స్వతంత్రముగా ఆస్తులను గడింతురు . వీరు భూములపై
పెట్టుబడి ( ఇన్వెస్ట్మెంటు) పెట్టుట మంచిది . వివాహ విషయములో కొంత ఆలస్యము
జరుగును .
౩ వ స్థానము మిధునము అగుచున్నది . ఇది బుధుని రాశి . ఈ రాశి కుజునకు
శత్రు క్షేత్రము . ఈ భావము సోదర , సోదరీలను సూచించు చున్నది . ఇక్కడ కుజుడున్న
జాతకులకు అన్న తమ్ములు ఎక్కువగా ఉందురు కానీ . జాతకునకన్నా పెద్ద వారైన అన్నలకు
నష్టము కలుగును . అన్న తమ్ముల మధ్య సరియైన ఐకమత్యము ఉండదు .
నాల్గవ స్థానము కర్కాటక రాశిలో కుజుడు నీచ స్థితి కలిగి ఉండును .
ఇక్కడ కుజుడున్న జాతకులు గృహము నిర్మించిననూ ఏదో ఒక లోపముండును . సరియైన గృహ వసతి
లేక పోవును . వీరు తల్లి తండ్రి పట్లకొంత వివక్ష కలిగి ఉంటారు .బంధువుల పట్ల గానీ
ఇతరుల పట్ల గానీ కొంత ఈర్ష్య, అసూయ కలిగి ఉండు అవకాశమున్నది . స్వయంకృత అపరాధము
వలన కొన్ని కష్టములను కొనితెచ్చు కొంటారు.
పంచమ స్థానమైన సింహ రాశి లో కుజుడు మిత్ర క్షేత్ర స్థితి కలిగిన వాడే
అయినప్పటికీ . ఇది సంతాన స్థానము . ఇక్కడ కుజుడు ఉండుట వలన జాతకులకు సంతాన నష్టము
కలుగును . స్త్రీలకు ప్రత్యేకించి గర్భ స్రావము కల్గుచున్నది . తొలి సంతానము నష్టము
తప్పదు . లేక అబార్షన్ అవుతుంది. వివాహము జరిగిన తరువాత సంతానము కొరకు మెడికల్
ట్రీట్మెంట్ అవసరము . మందుల వాడకము తర్వాత సంతానము కలుగు సూచన ఉన్నది .ఇక్కడ గురు
గ్రహ స్థితి బాగుంటే సంతానము వెంటనే కలుగుతుంది .
ఆరవ భావమైన కన్యారాశి కుజునకు శత్రు క్షేత్రము ఈ స్థానములో కుజుడున్న
జాతకులకు అనారోగ్యము తప్పదు . రక్త సంభంద రోగములు వచ్చును , ఆస్తులు , భూములు
మున్నగునవి కోర్టు వ్యవహారములలో ఇరుక్కుపోవును , తగవులను , పోలీసు కేసులను
ఎదుర్కొన వలసి వచ్చును . ముఖ్యముగా కుజ దశా అంతర్ధశ సమయములలో పై ఫలితములు
జరుగుతాయి .
No comments:
Post a Comment