మంచి వాగ్ధాటి కలవారు , వీరు శాంత స్వభావము కలవారిగా కనబడుదురు . కోపము
వచ్చిన ఎంతటి వారినైనా లెక్కచేయరు. మృదువుగా మాటలాడుచు ఇతరులను ఆకట్టుకొందురు . ప్రశాంతమైన
వాతవరాణములో బ్రతకాలని కోరుకొంటారు . వీరిలో కొందరు న్యాయవాద వృత్తులలో బాగా
రాణిస్తారు . సాధ్యమైనంత మటుకి ఎక్కువ విశ్రాంతిని కోరుకొంటారు . ఆరోగ్య విషయములలో
ఎప్పుడు జాగ్రత్తను పాటిస్తారు .
వాదనలకు దిగి వీరిని ఒప్పించుట చాల కష్టమైన పని , న్యాయాన్యాయ విచారణ లలో
వీరు ఇతరులకు తగు పరిష్కారములు చూపించ గలరు . గ్రామ పెద్దలుగానూ , సంఘముల యందు
అధ్యక్షులుగానూ, మరియు విభిన్న రకముల పదవులను
అలంకరింతురు . తొందర నిర్ణయములు తీసుకోరు . వీరు తమ మనస్సుకు నచ్చినట్లు నడచుకొంటారు
. ఇతరుల ఆలోచనలపై ఆధారపడరు .
వీరికి బంగారము , ఆభరణములు ,మొదలగు విలువగల వాటిపై మక్కువ ఎక్కువ . అందమైన ఇల్లు , నూతనములైన ఇంటి సామగ్రి ,ఇలా
కొత్తవస్తువులు అనిన వీరికి ఇష్టము , వీరికి స్త్రీల పట్ల గౌరవముంటుంది.
కానీ మనస్సును అదుపులో ఉంచుకోరు . తద్వారా స్త్రీలోలురు గా తయారవుతారు
. ఒక్కొక్కప్పుడు వ్యసనములకు ఆకర్షితులు
కాగలరు . సంగీత ప్రియులు . అలంకారములు ,
ఆడంబరము లకు ధనమును ఖర్చు చేస్తారు .
జూదము , మద్యపానము మొదలగు వ్యసనములకు తొందరగా
బానిసలు కాగలరు . ఈ విషయములలో తగు జాగ్రత్త పాటించుట అవసరము .
No comments:
Post a Comment