పుష్యమి నక్షత్రములో జన్మించిన వారు మంచి చతురత కలవారు
. హాస్యముగా మాట్లాడతారు . దైవభక్తి ఎక్కువగా ఉంటుంది . శారీరకముగా బలముగా ఉంటారు
. మానసికముగా పిరికివారు . పైకి మేకపోతు గాంభీర్యము ప్రకటిస్తారు . చంచల మనస్సు
కలవారు .ప్రియముగా మాటలాడుదురు . విద్య యందు అభిలాష ఎక్కువగా ఉంటుంది . తెలివైన
వారు . మేధావి . చదువులో రాణిస్తారు .
ఐశ్వర్యము కలవారు . చాలా ఉత్సాహముగా ఉంటారు .
వీరికి జీర్ణ వ్యవస్థ కు సంభందించిన రోగములు ఏర్పడును . దాంపత్య జీవితములో కొంత
అన్యోన్యత లోపించును . నిర్మల మనస్సు కలవారు . సదా సంచారము చేయు చుందురు .
ఎప్పుడు ఏదో పని కల్పించుకొని తిరుగుతూ ఉంటారు .
వీరు మనసున ఏది దాచుకోరు . అంతా ఓపెన్ గా ఉండాలని అనుకొంటారు . కల్మషము లేనివారు .
వీరికి వివాహ అనంతరము జీవితము గాడిలో పడుతుంది .
మంచి అభివృద్ధిని సాధిస్తారు . సమాజమున గొప్ప వారవుతారు . స్వార్జితముగా
వృద్ధిలోకి రాగలరు . కుటుంబ విషయములో ఇతర కుటుంబ సభ్యుల ప్రోత్సాహము తక్కువగా
ఉంటుంది . స్నేహితులు మరియు సన్నిహితుల ప్రోత్సాహము , సహకారము వలన వీరు జీవితమున
అత్యున్నత స్థాయికి చేరుకొంటారు .
గురువులను , పెద్దవారిని గౌరవిస్తారు . చేసిన
మేలును మరువరు . విశ్వాసముగా ఉంటారు . ఉపకార బుద్ది కలవారు ఆపదలో ఉన్నవారికి సహాయ
పడతారు . వీరి మనస్సు చాలా సున్నితమైనది. చిన్న చిన్న కష్టములను కూడా తట్టుకోలేరు.
వీరు అనుకొన్నది అనుకొన్నట్లు జరిగితే ఎంతో సంతోషిస్తారు . ఆనందమును పొందుతారు . వీరు
ఆరోగ్యమును జాగ్రత్తగా కాపాడుకొనుట మంచిది .
తీపి వస్తువులపై ఇష్టము ఉంటుంది . తిండి విషయములో
అతిగా తినకూడదు . ఎక్కువగా తినడము మంచిది కాదు . జాగ్రత్త పాటించుట మంచిది .వీరు
చిన్న తనమున సన్నముగా ఉండి తరువాత లావుగా అవుతారు . ఊబకాయులు గా తయారవుతారు . వాత సంభంద నొప్పులతో భాదపడతారు.
ఆర్ధిక విషయములలో తమకు తోచిన విధముగా సమయానుకూల నిర్ణయములు
తీసుకొంటారు . దీని వలన ఇబ్బందులు కలుగుతాయి .ఆపదకాల సమయములలో ధనము కొరకు సమస్యలను
ఎదుర్కొన వలసి ఉంటుంది . చాలా ప్రణాలికా బద్దముగా వ్యవహరించుట మంచిది .,
No comments:
Post a Comment