2014-01-24

జన్మ నక్షత్రము _ చిత్త

చిత్త నక్షత్రమున జన్మించిన వారు కర్కశ మనసు కలిగిఉంటారు . చిరాకు , కోపము ఎక్కువగా ఉంటాయి . పట్టుదల ఎక్కువగా ఉంటుంది . లౌక్యముగా వ్యవహారములు నడుపుచుందురు . అహంకారము , గర్వము కలవారు. మొండివారు . ఎవరికీ లోబడి యుండరు . పౌరుషము ఎక్కువ . వీరు ఒక పంధాను ఎంచు కొంటారు . ఇతరులు చెప్పినట్లు వినరు . తనకు తెలిసినదే నిజమని నమ్ముతారు .

మంచి చెడులను గురుంచి ఆలోచించరు . తాము అనుకొన్నది సాధించుకొనుటకు ఎంతకైనా తెగిస్తారు . తొందరపాటుగా నిర్ణయములు తీసుకొంటారు. తద్వారా చిక్కులు , సమస్యలను ఎదుర్కొంటారు . ఇతరులను గురించి పట్టించుకోరు. ఆత్మవిశ్వాసము ఎక్కువగా ఉంటుంది . బలిష్టమైన శరీరము కలిగి ఉంటారు . మానసికముగా ధైర్యముగా ఉంటారు . జీవితమున కలుగు కష్టనష్టములను పట్టించుకోరు .

హుందాగా కనిపింతురు . హంగు , ఆర్భాటములను ప్రదర్శింతురు . రహస్యములను కానీ తమ బలహీనతలను కానీ ఇతరులకు తెలియనివ్వరు . గోప్యతను పాటింతురు . సొంత కుటుంబ వ్యవహారములకన్నా ఇతర వ్యవహారముల పట్ల ఎక్కువ ఆసక్తిని చూపిస్తారు . ఈర్ష్య , అసూయ , ద్వేషములను కలిగి ఉందురు. వీరు నిలకడలేని ఆలోచన కలిగి ఉందురు. మొదలు పెట్టిన పనిని పూర్తిచెయ్యరు . ప్రతిఫలము చేతికి అందే సమయమున దానిని విడచి పెడతారు . వీరు కొంతకాలము ధనవంతులుగాను , మరికొంతకాలము సామాన్యులు గాను జీవితమును గడిపెదరు .

ఆర్ధికపరమైన విషయములలో ఎక్కువగా ఒడిదుడుకులు ఏర్పడును . ఒక ప్రణాళిక లేకుండా నడచుకోవడం వలన ఎప్పటికప్పుడు సమస్యలతో సతమతమగు చుందురు. జీవితము ఎల్లప్పుడూ సాఫీగా సాగాలని కోరుకొంటారు. కానీ స్వయంకృతాపరాధము వలన చిక్కులు కలుగును . ఈ నక్షత్ర జాతకులకు కుజ గ్రహము అధిపతి అగుటవలన యుక్తవయస్సులో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రవర్తించెదరు .కామ వాంఛ ఎక్కువగా ఉంటుంది .
                       
సుగంధద్రవ్యములన్న ఇష్టము . ఈ జాతకులు ముందు చూపు కలిగి భవిష్యత్తును గురించి బాటలు వేసుకోవడము , సహనమును అలవాటు చేసుకోవడము , నిదానముగా ఆలోచించి నిర్ణయములు తీసుకోవడం మంచిది . లేని పక్ష మున ఇబ్బందులు , సమస్యలు తో జీవితము కష్ట నష్టముల పాలగును .   

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...