2014-01-24

జన్మ నక్షత్ర ఫలితము _ అశ్విని

నక్షత్ర ఫలితము _ అశ్విని
అశ్విని నక్షత్రము నందు జన్మించిన వారు శక్తి సామర్ధ్య ములు కలిగి ఉంటారు . వీరు జన్మించిన నాటి నుండి కుటుంబము ఆర్ధికముగా , సామాజికముగా గౌరవ మర్యాదలు పెరిగి వృద్ధి పొందును . సాధారణముగా ఈ నక్షత్రమున జన్మించిన వారు చాలా తక్కువ స్థితి నుండి జీవితమును ప్రారంభించి ఉన్నత స్థితికి చేరుతారు . అలంకారములన్న వీరికి ఇష్టము . జీవిత భాగస్వామి వలన , సంతానము వలన వీరికి సంతోషము కలుగుతుంది .

ఏ విషయము పట్ల నైనా త్వరితముగా స్పందిన్తురు . వీరికి స్త్రీ వాంఛ అధికము . నిదానముగా మాటలాడుతారు . వీరు ఉద్యోగ సంభందము గా గానీ , వ్యాపార సంభందముగా గానీ , లేక బ్రతుకు దెరువు నిమిత్తము తన స్వస్తానమును విడచి వేరే ప్రాంతమునకు వలస పోవుదురు . తన స్వస్తానమున గాక ఇతర ప్రాంతములో గృహ నిర్మాణము చేయుదురు . వీరికి దక్షిణ దిశ లేక తూర్పు దిశలో గృహము అనుకూలము .

వీరు సామాన్యముగా కుటుంబమునందు పెద్దరికము వహింతురు . శరీరము వేడి తత్వము కలిగి ఉండును . పొడి బారిన చర్మము . సమమైన ఎత్తు కలవారు . దీర్గాయుస్సు కలవారు . వీరికి చిన్న తనమున మాటలు ఆలస్యముగా వచ్చును . విద్యా విఘ్నములు కలుగు చుండును . వీరితో స్నేహము చేసిన వారు బాగుపడతారు . వీరికి బంధువుల వలన మరియు స్నేహితుల మూలమున అపవాదులు , నిందలు కలుగును . వీరు సుమారు పూర్వార్జితమును ఆశించక స్వార్జితముగా సంపాదించుకొందురు .

నడి వయస్సు దాటిన తరువాత జీవిత భాగస్వామి వలన గానీ , పిల్లల వలన గానీ కొంత సమస్యలను ఎదుర్కొంటారు . కొంత ఆందోళన చెందుతారు . ఇతరులకు లోబడి ఉండ వలసి వచ్చును . వీరి జీవితము సుఖముగా ఉండును .


No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...