2013-08-17

లగ్న సాధన-1

లగ్న సాధన-1


జాతక చక్రము ను ఉపయోగించి వ్యక్తి జీవితము లో జరుగు శుభా శుభములు తెలుసు కొనుటకు ఖచ్చితమైన లగ్న సాధన అవసరము . లగ్నము ను ఖచ్చితము గా నిర్ణయము చేయ గలిగితే జ్యోతిష్య శాస్త్రము ద్వారా ఖచ్చిత మైన ఫలితము లు తెలుసుకోవచ్చు. ఈ లగ్న విశేషము గురించి
 సూర్య కిరణము లు భూమి పై ఏ భాగములో స్పర్శించునో ఆ ప్రాంతము లో సూర్యో దయము జరుగు చున్నదని మనకు తెలుసు . మహర్షులు చెప్పిన లగ్న ప్రమాణము ల ప్రకారము జాతకుడు జన్మించిన దినము న ఉదయ కాల లగ్న భుక్తి ని తెలుసు కొనవలెను . సూర్యోదయ కాలము నకు ఉన్న లగ్న ప్రమాణము లో లగ్న భుక్తి పోగా మిగిలిన లగ్న శేషము ను సూర్యోదయ సమయము నకు కలుప వలెను . తరువాత వచ్చే రాశి ప్రమాణము లను జాతకుడు జన్మించిన సమయము వరకు కలుపుతూ వస్తే జాతకుని జన్మ సమయము నకు ఏ లగ్నము నడచు చున్నదో అదే జన్మ లగ్న మన బడును.
ఉదా :
24.05.2013 శుక్ర వారం మధ్యాహ్నం 2 గంటల 35 నిమిషము లకు  విశాఖ పట్టణము లో ఒక బాబు జన్మించాడు .విశాఖ పట్టణము 8౩ . 20 డిగ్రీల  తూర్పు అక్షాంశము పై ఉన్నది. ఇక్కడ సూర్యోదయము 05గంటల 26 నిమిషములకు జరిగినది.  ఇండియన్ స్టాండర్డ్ టైము 5.30 గంటలు అనగా 82.30 డిగ్రీలను ప్రాతిపదికగా తీసుకొన్నారు . ఈ పట్టణము 82.50 డిగ్రీలనుండి సుమారు 0.70 డిగ్రీలు తూర్పున ఉండుట వలన ౩ నిమిషము లు ముందుగా సూర్యోదయము జరిగినది .

సూర్యోదయ కాలము నకు ఉన్న వృషభ లగ్న ప్రమాణము 02 గంటలు భుక్తి ౦. 4౦ నిమిషము లు పోగా 1 గంట 20 నిమిషము వృషభ లగ్న శేషము . దీనిని సుర్యోదయము నకు కలుపగా  గంటల ౦6 . 46 నిమిషములు వచ్చును.
06 .46 + మిధున లగ్నప్రమాణము 02 గంటల 12 నిమిషము లు= 08 . 58
08 . 58 + కర్కాటక లగ్నప్రమాణము 02 గంటల 1౩ నిమిషము లు = 11 . 11
11 . 11 +  సింహ లగ్నప్రమాణము 02 గంటల 08 నిమిషము లు = 13. 19
13 . 19 +  కన్యాలగ్నప్రమాణము 02 గంటల 06 నిమిషము లు = 15 . 25 నిమిషము వరకు ఉన్నది.

జాతకుడు జన్మించిన సమయము మధ్యాహ్నము 02 గం . 35 ని. లు కాబట్టి కన్య లగ్నము లో జన్మించి నాడని తెలుసు కోవాలి.

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...