2013-08-17

పూర్వాషాడ ఫలితము

పూర్వాషాడ ఫలితము 
పూర్వాషాడ నక్షత్రము లో పుట్టిన వారు చతురులు , విజ్ఞానము కలవారు . కోపిష్టులు . మంచి వస్త్రములను ధరించువారు . ఇతరులను ఆకర్షించు స్వభావము వీరికి ఉండును . దయ కలవారు . తాము నమ్మిన ఆశయముల కొరకు పోరాడు చుందురు . దైవబలము కలవారు . సమాజము పట్ల మంచి అభిప్రాయమును కలిగి ఉందురు . అందమును ఆస్వాదింతురు . వీరికి కళల పట్ల మక్కువ ఎక్కువ . నటులు , గాయకులు ఈ నక్షత్రమునకు చెందిన వారై ఉంటారు .

మృదు మధురముగా మాటలాడుదురు . కానీ సహనము తక్కువ . తొందరగా కోపింతురు . ఎదుటివారి మాటలను పూర్తిగా వినరు . చిరాకు పడతారు . తాము చెప్పినది అందరూ వినాలని కోరుకొంటారు . ఎవరైనా సరే వీరిని పొగిడితే ఆనంద పడిపోతారు . పొగడ్తలకు లొంగి పోతారు . అనుకొన్నది సాధించు కొందురు . గట్టి పట్టుదల , కాంక్ష , కలవారు . ఎదుటివారిని విమర్శించుటలో సిద్ధ హస్తులు .

వీరికి దైవము పట్ల నమ్మకము ఎక్కువగా ఉంటుంది . గృహ వాతావరణమును ఎక్కువగా ఇష్ట పడతారు . గృహములో ఎప్పుడూ సంతోషముగా ఉండాలని అనుకొంటారు . సంగీత వాయిద్యములు , లేక నటనా సంబంధిత వృత్తులలో వీరికి ప్రవేశము ఉంటుంది . ముఖ్యముగా సంగీతము పట్ల ప్రత్యేక ఆకర్షణ కలిగి ఉందురు . పాటలు , ఆటలు మొదలగునవి వీరికి ఇష్టము .

నిత్య నూతనముగా ఉండాలని కోరుకొంటారు . వీరికి జీవిత భాగస్వామి పట్ల ప్రేమ ఉంటుంది . కానీ ఇతర స్త్రీల పట్ల వ్యామోహము ఉంటుంది . వ్యసనములకు ఆకర్షితులు కాగలరు . త్రాగుడు , మొదలగు వ్యసనములకు బానిసలు కాకుండా ఉండుట మంచిది . విపరీతమైన ఖర్చులు పెడతారు . పొదుపును పాటించుట మంచిది . మంచి పేరు ప్రఖ్యాతలు కలిగి ఉందురు . ఉన్నత ఆశయములు కలవారు . Luxury Life కి అలవాటు పడతారు .

ముందు వెనుకలు ఆలోచించ కుండా దుడుకుగా వ్యవహరింతురు . దురుసు స్వభావము కలవారు . తొందర పాటు నిర్నయములు తీసుకొంటారు . దీని వలన అప్పుడప్పుడు కొద్ది ఇబ్బందులను ఎదుర్కొంటారు . గొప్ప మానవతా విలువలు కలవారు .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...