2013-08-16

నవగ్రహములు - ధాతువులు , Nine Planets - primitives


సృష్టిలో ఉన్న ప్రతివస్తువు ప్రతి పదార్ధము ధాతువుల సమ్మేళనమే . మానవుడు ఎంత అభివృద్ది సాధించినను ఈ సృష్టి నుంచే పొందుచున్నాడు. మహర్షులు మనకందించిన జ్యోతిష్య శాస్త్రము మరింత లోతుగా అధ్యయనము చేయుట ద్వారా మరింత పరిశోధన జరప గలిగితే మానవుని జీవనాభివృద్దికి అవసరమైన సలహాలు, సూచనలు అందించగలము.
లోహములు
రవికి రాగి,  చంద్రునకు మణులు, కుజునకు బంగారము , బుధునకు ఇత్తడి, కంచు . గురునకు వెండి
శుక్రునకు ముత్యములు , శనికి ఇనుము , సీసము
మానవుని శరీరంలో గ్రహముల అధిపత్యం
రవి ఎముకలు, చంద్రుడు రక్తము, కుజుడు ఎముకలలో ఉండు మజ్జ ,బుధుడు చర్మము , గురుడు మెదడు
శుక్రుడు రేతస్సు, శని నరముల పై ఆధిపత్యము వహించునని చెప్పియున్నారు.
అంతేకాక
శారీరక దృడత్వమును  - రవి వలన మానసిక స్తితిని చంద్రుని వలన శౌర్య, పరాక్రమములను- కుజుని వలన బుద్ధి సుక్ష్మతను బుధుని వలనను ఆలోచనా శక్తిని గురుని వలన  , శుక్రుని వలన సత్ప్రవర్తనను, శని వలన ఆయుస్సును మరియు బుద్ది మాంద్యతను తెలుసుకొన వచ్చును.

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...