2013-08-31

గ్రహములు- జాతులు 4



నవ గ్రహము లలో సూర్యుడు అత్యంత శక్తి కలిగిన గ్రహము . ఈ గ్రహము యొక్క ప్రభావము చేతనే మానవుడు సమాజము లో రాజ్య అధికారము లను పొందును . ఇంతకుముందు మనము గ్రహముల యొక్క జాతులను గురించి తెలుసుకొన్నాం . అయితే ఈ జాతులు ( కులములు ) ఇప్పుడు మన సమాజములో ఉన్న కులములు కాదని గ్రహించాలి.

ఎందుకంటే మొత్తం మానవ సమాజమును ఐదు వర్గములు గా విభజించారు . ప్రతి మనిషి జీవించుట కొరకు ఏదో ఒక వృత్తిని చేపట్టాలి . అయితే మనిషి చేపట్టబోయే వృత్తిని అనుసరించి జాతులుగా విభజించారు . గ్రహ శాస్త్రమున చెప్పిన జాతులు ఈ విధముగా ఉన్నాయి .

ప్రభుత్వము ను పరిపాలించు వారిని పాలకులు లేక క్షత్రియులు అని , సమాజమున ప్రజలకు మేలు కలిగించే విధంగా సలహాలు , సూచనలు ,అందిస్తూ సమ సమాజ నిర్మాణము కొరకు పాటు పడేవారిని బ్రాహ్మణులు అని,
వ్యాపారము వృత్తి గా చేపట్టు వారిని వైశ్యులు అని , శ్రామిక వర్గము నకు చెందిన వారిని శూద్రులు అని , అధర్మ బద్దముగా వ్యవహరించు వారిని మ్లేచ్చులు అని ఈ విధంగా ఐదు రకములుగా విభజించారు .

మానవులు అందరూ ఒకేలా పుడతారు . కానీ పెరిగి పెద్దవారు అయిన తరువాత ఒక్కొక్కరికి ఒక్కో విధమైన మనస్తత్వము , బుద్ది , ఆలోచనలు ఉంటాయి . బ్రతుకుదెరువు కూడా ఒక్కొక్కరికి ఒక్కోవిధముగా ఉంటుంది .
‘’ కొందరికి వద్దంటే డబ్బు . మరి కొందరికేమో ఆకలి జబ్బు ‘’  ఇది సామెత మాత్రమే కాదు యుగ యుగాల నుండి మానవులలో అంతరము కనబడుచునే ఉన్నది. దీనికి కారణము మహర్షులు ఇలా చెప్పారు .
మానవుడు జన్మాంతర కృత పాప పుణ్య ఫలములచే తను అనుభవిస్తాడు ..

ఈ సమాజమున ఈ జన్మలో మనిషి పొందు హోదా , గౌరవము , అధికారము సూర్యుడు యొక్క బలముపై ఆధారపడి ఉండును . ఎవరి జాతకము లో సూర్యుడు బలవంతుడు అయి ఉంటాడో అతడు లేక ఆమె గొప్ప అధికారములను పొందును అని శాస్త్రముల ద్వారా మనకు తెలియు చున్నది .

ఇట్టి అధికారములు కూడా కొందరికి సునాయాసముగా లభించును . కొందరికి ఎంతో కష్టపడితే గానీ రావు . కొందరు అవకాశములు వచ్చిననూ చేజార్చు కొంటారు . మరికొందరికి వారసత్వముగా వచ్చు చున్నవి . వీటన్నిటికి గ్రహము ల బలములే ఆధారము . సూర్యుడు బలము కలిగి ఉన్నా నైసర్గిక పాపగ్రముల ప్రభావమునకు లోనైతే అవకాశములు వచ్చినట్లే వచ్చి తృటిలో తప్పి పోతాయి .     

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...