2013-09-01

సూర్యుడు – శుక్రుడు



జాతకము లో గ్రహములు బలమును గురించి వివరించు కుంటున్నాము.
ఇప్పుడు  సూర్యుడు శుక్రుడు ఈ కాంబినేషన్ కు సంబంధించి చర్చిద్దాం .
జాతకము లో సూర్యుడు గురుడు , శుక్రుడు ఈ గ్రహములు ఒకే సరళ రేఖపై ఉన్నప్పుడు లేక దగ్గర దగ్గరగా ఉన్నప్పుడు మూఢమి ఏర్పడుతుంది . సూర్యుడు తో  కూడిన లేక కలసి ఉన్న ఏ గ్రహమైనా శుభ ఫలితములు ఇవ్వదు . కావున గ్రహములు ఈ కాంబినేషన్ లో ఉన్నప్పుడు వివాహము , గృహ ఆరంభము మొదలగు సమస్త శుభ కార్యములు  చేయకూడదు అని మహర్షి వచనము .

కానీ జాతకము పరిశీలనలో పైన తెలిపిన విషయములు వర్తించుట లేదు . జాతకము పరిశీలన చేసే టపుడు గ్రహముల కలయికను మాత్రమే చూడ కూడదు. ఫలిత నిర్ధారణ చేయు నపుడు గ్రహము జన్మ లగ్నము నుండి ఏ భావము నకు అధిపత్యము వహించు చున్నది. ఏ ఏ భావాధిపతు లతో కలసి యున్నది .ఏ క్షేత్రము నందున్నది . ఏ క్షేత్ర భావ అధిపతులతో చూడబడు చున్నది . ఇలా అనేక విషయములను పరిశీలించాలి .

సూర్యుడు శుక్రుడు . ఈ కాంబినేషన్ బాగున్న జాతకులు ఆకర్షణీయ రూపము కలిగి ఉంటారు . వీరు కళా రం గమున ఎలక్ట్రానిక్ మీడియా , సినిమా , నాటక రంగము , గాయకులు , సంగీత విద్వాంసులు , మొదలగు రంగములలో స్థిరపడతారు . వస్త్ర పరిశ్రమలు , అద్దకం పరిశ్రమలు , అలంకరణ సామగ్రి , పర్యాటక రంగములలో జీవనము సాగించ గలరు . వినోద రంగముల యందు , మహిళలు కు సంబంధించిన అనేక రంగములలో, జీవనము సాగించ గలరు . విలాస వంతమైన జీవితమును గడుపుతారు .

సూర్యుడు శుక్రుడు కాంబినేషన్ బలముగా ఉన్నవారు . పైన తెలిపిన విభాగములలో అత్యున్నత స్థాయిని పొందుతారు . ఈ కాంబినేషన్ బాగులేనివారు  వ్యసన పరులు , స్త్రీల పట్ల ఆకర్షితులై , కామోద్రిక్తులై ఉంటారు . వ్యసనముల బారిన పడి జీవితమును నాశనము చేసుకుంటారు . కుటుంబము పట్ల భాద్యత ఉండదు . వీరికి ఆదాయము కన్నా ఖర్చులు అధికముగా ఉంటాయి .    

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...