గ్రహములకు
వర్ణించిన రంగులన్ని సూర్య కాంతిలో ఐక్యమై
యున్నవి. వీటిని మనము ఆకాశములో అప్పుడప్పుడు కనపడే ఇంద్రధనుస్సులో చూడగలుగు
చున్నాము. సైన్స్ ప్రకారము సూర్యుని
చుట్టూ గ్రహములన్నియు తిరుగుచున్నట్లు మన సైంటిస్టులు నిరుపించినారు. ఈ పద్దతి
ప్రకారము విశ్వమంతటికీ సూర్యుడే ఆధారము.
భూమి స్తిరంగా ఉన్నదని అనుకొని మిగతా గ్రహములు
నక్షత్రములు అన్నియు వాటి వాటి కక్ష్యలలో తిరుగుచున్నాయని అనుకొన్నప్పుడు
విశ్వమంతటిని 27 నక్షత్రములు గావిభజించినారు.
కాని ఈ విశ్వములో అనంతమైన గ్రహములు నక్షత్రములను
మనము చూడగలుగు చున్నాము. మరియు అనేక రకములుగా ఈ సృష్టిరహస్యం పై పరిశోధనలు
జరుపుచునే యున్నాము.
.
.
భూమి చుట్టురా
గ్రహములన్నియు తిరుగు చున్నవని జ్యోతిష్యశాస్త్రవేత్తలు తెలిపియున్నారు. భూమి చుట్టూ చంద్రుడు మాత్రమె
తిరుగు చున్నాడని భూమితో పాటు మిగతా గ్రహములన్నియు సూర్యునిచుట్టే తిరుగుచున్నవని
విజ్ఞాన శాస్త్రవేత్తలు తెలిపియున్నారు.
*భూమి తన చుట్టూ తాను తిరుగుటవలన పగలు రాత్రి
ఏర్పడు చున్నవి. చంద్రుడు భూమిచుట్టూ
తిరుగుట వలన అమావాస్య పౌర్ణమి ఏర్పడుచున్నవి. ఈరెండు విషయములలో
విజ్ఞానశాస్త్రవేత్తలకు, జ్యోతిష్యశాస్త్రవేత్తలకు పోలికయున్నది. *
గ్రహములన్నియు తమతమ
కక్ష్యలలో సూర్యునిచుట్టూ { రాశి చక్రము చుట్టూ} తిరుగు చున్నవని మనకు తెలియును .కానీ
ఆయా గ్రహములయొక్క వేగము
వివిధరకములుగాయున్నది
చంద్రుడు భూమిని
చుట్టి వచ్చుటకు సుమారు 28 రోజులు భూమితో పాటు సూర్యుని చుట్టి వచ్చుటకు ఒక
సంవత్సరం.
సూర్యుడు ఒక
సంవత్సరము { 1. ఇక్కడ
జ్యోతిష్యశాస్త్రజ్ఞులు చెప్పిన విధముగా 2 .
విజ్ఞాన శాస్త్రజ్ఞులు చెప్పిన విధముగా భూమి సూర్యుని చుట్టి వచ్చుటకు )
కుజుడు ఒక సంవత్సరం
ఆరునెలలు
బుధుడు సుమారు ఒక
సంవత్సరము
శుక్రుడు సుమారు ఒక
సంవత్సరము
గురుడు పన్నెండు
సంవత్సరములు
శని ముప్పై
సంవత్సరములు.
రాహు , కేతు
గ్రహములు పద్దెనిమిది సంవత్సరములు
No comments:
Post a Comment