ఉత్తర నక్షత్రమున జన్మించిన వారు శాంత స్వభావము
కలిగి ఉందురు . నిర్మలమైన మనస్సు కలవారు . తెలివైనవారు. ఆదర్శవంతమైన జీవితమును గడిపెదరు.
సమాజ సేవకై పాటు పడతారు . ఉన్నతమైన ఆశయములు కలవారు . కల్మషము లేనివారు . మంచి
విద్యావంతులు . విషయ పరిజ్ఞానము కలవారు . తొందర పాటు ఉండదు . నిదానముగా
ఆలోచిస్తారు . బంధువులు , స్నేహితుల మధ్య పరస్పర సంభంధములు కలిగి ఉంటారు .
వీరిని అర్ధం చేసుకొనే జీవిత భాగస్వామి లభిస్తారు
. తెలివైన , బుద్దిమంతులైన సంతానము కలుగుతుంది. వీరికి సునాయాస ధనయోగము కలుగుతుంది
. సమాజమున పేరు, ప్రఖ్యాతలు లభిస్తాయి . గౌరవ మర్యాదలు పెరుగుతాయి . ఇతరులకు సహాయ
పడుదురు . కుటుంబ భాధ్యతను నిర్వహించుటలో మంచి సమర్ధత కలవారు . ముందు చూపు కలవారు
. కుటుంబ సభ్యులలో ఎవరికీ ఏది అవసరమో ముందే తెలుసుకొని దానికి అనుగుణముగా ఏర్పాటు
చేయుదురు .
సాధు స్వభావులు . పరుల హితమునకై పాటు పడతారు .
అందరూ సుఖముగా ఉండాలని కోరుకొంటారు . ,వీరికి స్వలాభాపేక్ష ఉండదు . సహృదయులు . తన
స్వంత తెలివి తేటలతో జీవితమున అభివృద్ది సాధించ గలరు . అన్ని విధాలా ఆలోచించి గానీ
నిర్ణయము తీసుకోరు . మంచి , చెడులను విచారించి ముందడుగు వేస్తారు . వీరు కుటుంబ
యజమానిగా గానీ , లేక చిన్న చిన్న సంస్థలకు అధిపతులుగా గానీ బాగా రాణిస్తారు .
క్లిష్టపరిస్థితులు ,క్లిష్ట సమస్యలు ఏర్పడినపుడు చాలా చాకచక్యముగా వ్యవహరించగలరు
.
నలుగురునీ కలుపుకొనుపోవు మనస్తత్వము కలవారు ,
గొడవలు , తగవులకు దూరముగా ఉంటారు . ఉద్రేకము ఉండదు . సమయోచితముగా సందర్భమును బట్టి
పరిస్థితులకు అనుగుణముగా ఇమిడి పోతారు . ఘర్షణ , వాదోపవాదములు వీరికి ఇష్టము ఉండవు
. ఇతరులకు హాని కలిగించే విధముగా ప్రవర్తించరు . వీరికి స్త్రీ వాంఛ అధికముగా ఉండును.
గృహము నందు ప్రశాంతతను కోరుకుంటారు . దైవభక్తి కలవారు . మంచి వాక్పటిమ కలిగిన వారు.
అనర్గలముగా మాట్లాడగలరు .
ఇతరుల మనసునెరిగి ప్రవర్తింతురు . మంచి ఉపన్యాసము
చేయగలరు . దీర్గ కాలములో జరగబోవు మంచి చెడుల గురుంచి ముందే ఊహించగల మేధావులు . మంచి ప్రణాలికా బద్దముగా నడచుకొంటారు
. ధనముతో పాటు కుటుంబము , భాద్యతలు , స్నేహితులు , బంధువులు , నీతి , నిజాయితీలు
అన్నింటికీ విలువనిస్తారు . మొత్తం మీద వీరి జీవితము చాలా సుఖముగా ఆనందముగా
సాగుతుంది .
No comments:
Post a Comment