2014-01-24

జన్మ నక్షత్రము – అనూరాధ


అనూరాధ నక్షత్రములో జన్మించిన వారు తెలివైన వారు . .సున్నితమైన వారు . ప్రసన్న వదనము కలవారు . పుణ్యకార్యములు చేయుదురు .అనుకరణ చేయుదురు. స్వతంత్రముగా ముందడుగు వేయరు . ఇతరులు చెప్పినట్లు వింటారు . అనుసరించే స్వభావము ఎక్కువగా ఉంటుంది . వీరిని నమ్మించుట చాలా కష్టము . ఇతరులపై సదభిప్రాయము కలిగి ఉందురు . ఇతరులను నమ్ముతారు . పొరపాటున అనుమానము కలిగితే వారిని జీవితాంతము నమ్మరు .

ఎంత మంచిగా ఉన్నా సరే ఒకసారి వీరి దృష్టిలో చెడుగా అనిపిస్తే మాత్రం దగ్గరకు రానివ్వరు . ఇతరులవలన కలిగిన మేలును మరచి పోతారు . కీడును మాత్రము గుర్తించు కొంటారు . ఈ విధముగా వ్యవహరించుట వలన చులకన అవుతారు . నెమ్మది స్వభావము కలవారు . ఏ విషయమునైనా చాలా తేలిగ్గా తీసుకొంటారు . కొంత నిర్లక్ష్యముగా ఉంటారని అనవచ్చు . తనకు నచ్చని విషయములను తోసిపుచ్చెదరు .ఇతరులతో వాదము చేయరు .

వీరికి మిత్రుల కన్నా శత్రువులు ఎక్కువ . మాట పట్టుదల కలిగి ఉందురు . పట్టు విడుపులు ఉండవు . తాము ఏది అనుకొంటారో అలాగే ఆలోచిస్తారు . అలాగే జరగాలని అనుకొంటారు . కానీ జరిగే వన్నీ వీరి ఆలోచనలకు వ్యతిరేఖముగా జరుగుతాయి . అనవసర విషయములను గురుంచి ఎక్కువగా ఆలోచిస్తారు . భయము కలవారు . క్లిష్ట పరిస్థితులు ఎదురైనప్పుడు అసహనము తో ఉంటారు . మనోధైర్యమును కోల్పోతారు .


చిన్న చిన్న విషయములకు తమలో తామే మదన పడిపోతారు . జీవిత భాగస్వామికి కూడా ఏ విషయమును చెప్పరు.  గోప్యతను పాటిస్తారు . గుంభనంగా ఉంటారు . తమ మనోభావములను ఇతరులకు తెలియ నివ్వరు . స్త్రీ సౌఖ్యమును కోరుకొంటారు . వీరు నరముల బలహీనత కలిగి ఉందురు . బలహీనత , జాయింటు పెయిన్స్ తో భాద పడతారు . దైవముపై నమ్మకము కలవారు .కానీ ఏది పడితే అది గుడ్డిగా నమ్మరు . పురాతన సంప్రదాయములను గౌరవిస్తారు .   

అన్యాయాన్ని , అక్రమాలను సహించలేరు . అందరూ నిజాయితీ కలిగి ఉండాలని అనుకొంటారు . ఇతరులకు సహాయ సహకారములు అందిస్తారు . కానీ వీరి ప్రవర్తన మూలకముగా బంధువులు , స్నేహితులు కూడా దూరమవుతారు . ఆపద సమయములో  వీరికి ఎవరూ సాయము చెయ్యరు . అధిక ధన వ్యయము చేస్తారు . పొదుపును పాటించరు. అందువలన ధనమునకై ఇబ్బందులు పడతారు . జాగ్రత్త అవసరము .  

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...