గ్రహములకు శాశ్వత మిత్రులు శత్రువులను గురించి
ఇంతకూ ముందు పోస్టులో తెలుసుకున్నాం .
ఇప్పుడు తాత్కాలిక మిత్రులు మరియు తాత్కాలిక
శతృవులు గురించి తెలుసు కుందాం .
జన్మ లగ్నము నుండి గానీ లేక గ్రహము స్థితి
పొందిన స్థానము నుండి గానీ 2 ౩ 4 మరియు 10
11 12 స్థానాల యందు ఉన్న గ్రహములు
తాత్కాలిక మిత్రులు అగుదురు . 5 6 7 8 9 1 స్థానముల యందు ఉన్న గ్రహములు తాత్కాలిక
శత్రువులు అవుతారు .
ఉదా >: సూర్యునకు గురుడు jupiter మిత్రుడు అని శాశ్వత
చక్రము ద్వారా తెలియు చున్నది .
ఒక వ్యక్తీ జాతక చక్రములో సూర్యుడున్నsun స్థానము
నుండి 2 ౩ 4 లేక 10 11 12 స్థానములలో గురుడు JUPITER ఉన్నట్లయితే సూర్యునకు గురుడు
అధిమిత్రుడు అగును . దీని వలన సూర్య దశ SUN మరియు గురు దశ మరియు అంతర్దశ కాలములలో
అత్యంత శుభ ఫలితములు కలుగును .BEST RESULT
ఒక వేళ సూర్యుని నుండి గురుడు 5 6 7 8 9 1
స్థానములలో ఉన్నప్పుడు మిత్రుడైన గురుడు సమ గ్రహము గా మారి పోవును అందుచేత శుభ మరియు
అశుభ ఫలితములను సమానముగా కలుగ చేయును .
ఉదా : సూర్యునకు శని శత్రువు అని శాశ్వత చక్రము
ద్వారా తెలుసుకున్నాం .
మరొక జాతకములో సూర్యునుండి శని గ్రహము 6 వ
స్థానములో ఉన్నాడని అనుకొంటే ఆ శని గ్రహము అధిశత్రువు గా మారి పోవును , ( బలమైన శత్రువుగా
ఉన్నాడు ) . దీని వలన శుభ ఫలితములు కలుగవు . కానీ అత్యంత ప్రభావంతమైన పాప
ఫలితములను కలుగ చేయును . ఈ విధముగా ప్రతీ వ్యక్తీ జాతక చక్రములో ఉన్న గ్రహముల
స్థితి ఆధారముగా గ్రహములకున్న బలము మార్పు చెందును . ఒక వ్యక్తీ జీవితములోLIFE జరుగు
ఫలితములు మరొక వ్యక్తీ జీవితములో జరగక పోవడానికి కూడా ఇదియే కారణము .ప్రతి వ్యక్తికీ జరుగు పరినామములన్నియు గ్రహముల
యొక్క బలాబలములను అనుసరించి మాత్రమే జరుగును ..
మనలో చాలా మందిని చూస్తున్నాము . మా అబ్బాయి
ఫలానా నక్షత్రములో పుట్టాడు . వాడి జీవితనకు తిరుగులేదు. అని అంటూ ఉంటారు .కానీ
అదే నక్షత్రములో పుట్టిన వారు సామాన్యులు ఉంటారు . గొప్పవాళ్ళు ఉంటారు .
బిచ్చగాళ్ళుPOOR MENS ఉంటారు . ధన వంతులుCAPITALIST ఉంటారు . ఒకే నక్షత్రములో , ఒకే పాదములో పుట్టిన
వారి మధ్య ఈ తేడా ఎందుకు వస్తుంది . అందరూ ఒకేలా ఉండాలి కదా ?
దీనికి కారణము ఏమిటంటే జాతకుడు జన్మించినప్పుడు
ఉన్న గ్రహస్థితులు , ఆయా గ్రహములకు ఉన్న బలమును అనుసరించి మాత్రమే జీవనము ఆధారపడి
ఉంటుంది .
No comments:
Post a Comment