'' మాకు శని పట్టింది , శని వెంటాడుతుంది '' అని అనేక రకములుగా నిందిస్తూ ఉంటారు .
అయితే శనీశ్వరుడే లేక పొతే మానావుడే లేడు . అసలు ఈ భూమిమీద జీవమే లేదు . అదేమిటో చూద్దాం .
శని వాయు తత్వ కారకుడు . ఈ సృష్టిలో ఉన్న వాతావరణములో గాలి లేకపోతే చలనము ఉండదు . అంతెందుకు మన చుట్టూ విశ్వములో కన్పిస్తోన్న ఈ గ్రహములు నక్షత్రములు ఏవీ ఉండవు . ఈ వాయువు వలన భూమి స్థిరముగా గురుత్వాకర్షణ శక్తి కలిగి ఉన్నది . వాయువే లేకపోతె శబ్దము ఉండదు .
మానవులే కాకుండా ఈ సృష్టిలో ఉన్న సకల జీవరాశులు , పశు పక్ష్యాదులు , వృక్షములు అన్ని గాలి వలన జీవిస్తూన్నాయి . ఈ సృష్టి లో ఏ జీవి అయిన తిండి లేక పొతే బ్రతుక గలదేమో గానీ ఊపిరి తీసుకోకుండా బ్రతుక గలదా ?
ఇంక మరొక విషయానికొస్తే శనీశ్వరుని వలన కష్టములు కల్గుతాయనీ , చాలా భాధలు ఏర్పడుననీ అందరూ అనుకొంటూ ఉంటారు . నిజానికి గత జీవితమును గుర్తొచ్చే విధంగా చేస్తాడు . మనిషి లో ఉన్న కామ , క్రోధ , లోభ , మద ,మోహ , మాత్సర్యము అను ఆరు గుణముల చే అదుపు తప్పి ప్రవర్తించే వారిని గాడిలో పెట్టగల సమర్ధుడు
No comments:
Post a Comment