జ్యేష్ట నక్షత్రములో జన్మించిన వారు చక్కగా
మాట్లాడెదరు . సమయ స్పూర్తి కలిగినవారు . పెద్దల పట్ల గౌరవ మర్యాదలు కలవారు . భాగ్యవంతులు
. ఈ నక్షత్రమున పుట్టిన వారిని వివాహమాడిన జీవిత భాగస్వామి అన్నలకు (బావ గారికి,
మరియు బావ మరిది ) ( ఈ విషయములో స్త్రీలు
అయితే భర్త అన్నలకు , పురుషులు అయితే బావమరిది భార్య అన్నగారికి ) దోషమని యున్నది
. అలాంటప్పుడు ఏకైక సంతానము కలవారికి గానీ
, అన్నలు లేనటువంటి వారు అనగా తొలుచూరు సంతానము గా జన్మించిన వారికి కానీ ఇచ్చి
వివాహము చేయుట వలన పైన చెప్పిన దోష ప్రభావము నుండి తప్పించు కొనవచ్చును .
అయితే జ్యేష్టులకు వివాహము చేయరాదని కూడా
శాస్త్రములలో చెప్పబడి యున్నది కదా ? ద్వి జ్యేష్ట వలన వివాహమునకు ఆటంకము కలుగదు .
కాకపొతే జ్యేష్ట మాసములో వివాహము చేయరాదు . త్రిజ్యేష్ట పనికిరాదు.
ఇక రెండవ విషయము జ్యేష్ట నక్షత్ర మొదటి పాదములో
జన్మించిన వారికే పైన తెలిపిన దోషము వర్తించు చున్నది . మిగతా 2 ౩ 4 పాదములలో
పుట్టిన వారికి వర్తించుట లేదు . కావున విషయములను జాగ్రత్తగా గమనించగలరు .
ఈ నక్షత్రమున జన్మించిన వారు వివాహము చేసుకోదలచిన
భాగస్వామి ( life partner )కుటుంబములో మొదట ఆడపిల్ల
జన్మించి ఉంటే తరువాత
పుట్టిన వారిని వివాహము చేసుకొనుట వలన కూడా పైన తెలిపిన దోషము వర్తించదు . ఈ
విధముగా కొన్ని ప్రత్యామ్నాయములను అనుసరించుట వలన శాస్త్రములలో చెప్పబడిన దోష
ప్రభావములనుండి రక్షణ పొందగలము .
ఈ నక్షత్ర జాతకులు చాలా జాగ్రత్తగా ఉంటారు .
ఓర్పు సహనము కలవారు . మాయా స్వభావము వీరికుండును . అసత్యములను పలుకుటకు వెనుకాడరు
. స్తోమత కలవారు , సంఘము నందు పెద్ద మనుషులుగా చెలామణి అగువారితో స్నేహము చేయుదురు
. కామవాంఛ అధికముగా ఉండును. ఎప్పుడూ సంతోషముగా ఉండాలని కోరుకొంటారు . భోగములను
అనుభవింతురు. వీరు స్వంతత్రముగా జీవితమున అభివృద్ది సాధించ గలరు . అహంభావము కలవారు
.
విద్వాంసులు . ఉత్సాహ వంతులు . ఏ పని చేయుట కైనా
వెనుకాడరు . లౌకికము తెలిసిన వారు . వీరు ఎక్కువగా ఋణములు చేయుట మంచిది కాదు .
సర్వ సమర్దులే కానీ ఋణ ఒత్తిడులు పెరుగుటచే కొంత కష్ట నష్టములను ఎదుర్కొను అవకాశమున్నది
. ధన విషయమున ప్రత్యేక జాగ్రత్త అవసరము .
No comments:
Post a Comment