2013-08-09

శాస్త్రములు – పరిశోధన



విశ్వం లో ఉన్న వాతావరణమును, భగవంతుడు సృష్టించిన ప్రతి దానిని తన అవసరాలకు అనుగుణంగా ఉపయోగించుకొని మానవుడు బ్రతకడం నేర్చుకొన్నాడు . ఈ సృష్టి అనంత మైనది . దీని పరిధిని తెలుసు కొనడం మానవునికి అసాధ్యమైన పని . ఆది మానవుని గురించి మనకు తెలుసు . నాటి కాలములో  మానవుడు ప్రకృతిలో లభించే వనరులను ఉపయోగించి బ్రతకడం మొదలెట్టాడు . తాను బ్రతుకుతూ ఈ ప్రకృతి ని ఇంకా ఏ విధంగా ఉపయోగించవచ్చు , మానవాళి మరింత సులభంగా బ్రతకడానికి ఏమైన చేయగలమా ? అని ఆలోచించడం ప్రారంభించాడు . 

ఆ ఆలోచన నుంచి పుట్టిన దే సాధన , శోధన .
ఈ విధంగా కొన్ని వేల సంవత్సరముల శోధన ఫలితముల నుంచి ఏర్పడినవే శాస్త్రములు . మానవ జీవితమునకు సంబంధించిన అన్ని శాస్త్రములు ఈ విధముగా పుట్టినవే . జ్యోతిష్య శాస్త్రము మాత్రమే  కాదు,ఆయుర్వేదము , వైద్య శాస్త్రము , వాస్తు శాస్త్రము ,మరియు ఈ నాడు ప్రపంచములో అత్యంత ఆదరణ పొందుతున్న విజ్ఞానశాస్త్రము ( సైన్సు ) కూడా నిత్య పరిశోధనల వలన అభివృద్ది చెందినదే . మన పూర్వీకులు ఎంతో సాధన చేసి శోదించి మనకు అందించిన శాస్త్రములను అవమాన పరచుట మంచిది కాదు .ఈ మధ్య కాలములో కొంతమంది జ్యోతిష్యము మూఢ నమ్మకమని అసలు జ్యోతి`ష్య శాస్త్రమే లేదని చెప్పుచున్నారు .  
 
ఇట్టి శాస్త్రములను అవమాన పరచే ముందు పూర్వీకుల శ్రమను,  వారు  భావి తరాలకు అందించిన స్పూర్తిని గుర్తుకు తెచ్చుకోవడం మంచిది . మానవుడు నిత్య జిజ్ఞాసి , తాను సాధించిన దానితో తృప్తి చెందక నిరంతరము పరిశోధనలు సాగిస్తూనే యున్నాడు . కొత్త , కొత్త విషయములను కనిపెట్టి మానవ అభివృద్ధికి తోడ్పడుతూనే యున్నాడు . ఈనాడు , నాసా గానీ , భారత దేశములో ఉన్న ఇస్రో లాంటి పెద్ద పెద్ద సంస్థలు చేస్తున్న పరిశోధనలు కూడా దీనిలో భాగమే .

అయితే చెప్పే విధానములో తేడా ఉండవచ్చు గానీ , నవ గ్రహములలో  సూర్యుడు సమస్త లోకాలకు అధిపతి యని , సౌర కుటుంబము నకు అతడే రాజు అని ,చెప్పారు.
సూర్యుని భగవంతుడని నమ్ముతారు . ఈ సృష్టిని పరిపాలించు వాడు సూర్యుడని నమ్మకము . అది యదార్ధము కూడా
ఉదా : కిరణజన్య సంయోగ క్రియను గురించి మనకు విజ్ఞాన శాస్త్రవేత్తలు చెప్పి యున్నారు . సూర్యరశ్మి ని ఉపయోగించుకొని మొక్కలు కిరణజన్య సంయోగ క్రియ జరుపు కొంటాయని మనమందరము చదువు కొన్నాము .
మొక్కలు , చెట్లు , వృక్షాలు సూర్య కిరణములు వల్లే అవి ఆహారమును తయారు చేసు కొంటున్నాయి . భూమి పై పెరుగుతున్నాయి . .తద్వారా పంటలు పండుచున్నాయి . పండిన పంటలను ఆహారముగా ఉపయోగించు కోవడం జరుగుతుంది . .సూర్యుడే లేనప్పుడు ఈ సృష్టిలో జరుగు అనేక ప్రక్రియలు లేవు . అసలు మానవుడే లేడు. చంద్రుని వలన అమావాస్య , పౌర్ణమి సమయములలో సముద్రముల యందు ఆటు ,పోటు లు ఏర్పడు చున్నవి.పై రెండు ఉదాహరణలు మనకు ప్రత్యక్షంగా కనబడు చున్నవే కదా. ఏ శాస్త్రము లో నైనా లోపములు ఉండవచ్చు , లోపములను సరిచేసుకొని ,మరింత పరిశోధన చేయుట ద్వారా మానవాళికి ఉపయోగ పడిన వారమవుదాం ?.      

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...