2013-08-15

సంసార జీవితము

మనలో చాలా మందికి వివాహ పొంతన విషయములో అనేక రకముల సందేహములు కలుగు చున్నవి . అంతా దైవ నిర్ణయము ప్రకారమే వివాహము జరుగు తుంది.  ఒకరి కోసం ఒకరు ఎక్కడో ఒక దగ్గర పుట్టి ఉంటారనీ పెద్దలు చెప్పు చుంటారు . ఇది కొంత మంది నమ్మకముగా ఉన్నది . మరి అలాంటప్పుడు పెండ్లి సంబంధముల 

కోసం ఆరాటము ఎందుకు ? ఎందుకంటే తగిన జోడీ ఎక్కడ దొరుకుతుందో తెలుసు కోవడానికి? 

మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుకూలముగా అనేక రకముల Marriage Bureaus కులము , మతము, ప్రాంతములను బట్టి ఏర్పడినవి . వీటి ద్వారా ఆస్తి , అంతస్తు , హోదా , విద్యార్హత , ఉద్యోగము సంభందిత వివరములను తెలుసుకొని అనుకూలమైన జీవిత భాగస్వామిని ఎంచు కొంటున్నారు . కానీ వారి యొక్క తత్వము , ఆలోచన , ప్రవర్తన , వినయము , విధేయత మొదలగు అనేక విషయములను ఏ విధముగా తెలుసుకొంటాము .

సముద్రమును ఈదగలము గానీ సంసారమును ఈద లేము అని ఒక సామెత ఉన్నది.’’.
సంసారం ఒక చదరంగం . అనుబంధం ఒక రణరంగం .   
దీని అర్ధమేమనగా సంసార జీవితములో అనేకరకముల బరువు భాద్యతలు , కష్టములు , సుఖములు , పరువు , ప్రతిష్ట , గౌరవము, మర్యాద ,బంధువులు , స్నేహితులు, అనుబంధాలు , ఆప్యాయతలు ఇలా అనేక రకముల సమస్యలను Balance చేసుకుంటూ రావాలి . ఇన్ని సమస్యల మధ్య ఎక్కడ Balance తప్పినా కుటుంబ జీవితము అనేక ఇబ్బందులను ఎదుర్కొన వలసి వస్తుంది .

భార్య, భర్త, ఇరువురు సంసారము అను బండికి రెండు ఎద్దులు లాంటివారు . ఇద్దరు ఆలోచనలో, ,ప్రవర్తనలో, ముందుచూపులో , ఇంకా కుటుంబ వ్యవహారములలో ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండి నపుడు ఆ సంసారము ఏ విధమైన చికాకులు లేకుండా హాయిగా సాగుతుంది . లేని యెడల అనేక విధముల సమస్యలతో అస్తవ్యస్తము అవుతుంది .
ఈ భూమి పై పుట్టిన ఏ ఇద్దరి మనుషుల ప్రవర్తనగానీ , ఆలోచన గానీ ఒకేలా ఉండదు . Positive thinking and naegative thinking  ఉంటుంది .   ఒక Positive thinking కల వ్యక్తికీ ఒక  negative thinking  కల వ్యక్తికీ వివాహము చేస్తే ఆ సంసారము సాగుతుందా ? ఒకరి పట్ల ఒకరు అనుకూలముగా ఉండగలరా ?

ఈ విషయములు అన్నీ దృష్టిలో ఉంచుకొని మన పూర్వీకులు గ్రహ శాస్త్రమును పరిశోధన చేసారు. ఈ శాస్త్రము ద్వారా జన్మ నక్షత్రము , జన్మ రాశి , జన్మ లగ్నము , గ్రహ స్థితులను బట్టి మానవుని లక్షణములు , పవర్తన , ఆలోచన మొదలగు అనేక విషయములను తెలుసుకొనవచ్చుననీ , తెలియ పరచినారు .

వివాహ సంబంద విషయములను జ్యోతిష్య శాస్త్రము ద్వారా జాగ్రత్తగా పరిశీలన చేసి వివాహము చేసుకొనుట వలన సంసార జీవనము సుఖముగా సాగుతుందనీ మన పూర్వీకుల అభిప్రాయము .

వివాహ జీవితము , సంసార జీవనము సుఖముగా ఆనందముగా హాయిగా సాగాలని సకల జనులు సుఖముగా ఉండాలని ఈ విధమైన మార్గములను మనకు  సూచించినారు .        

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...