2013-08-15

నా విశ్లేషణ

ఏ నక్షత్రమున జన్మించిన వారికైనా వివాహము జరిగిన తరువాత జీవితము ఇలా ఉంటుంది అని చెప్పడము చాలా కష్టము . ఎందుకంటే నక్షత్రమును మాత్రమే పరిగణనలో తీసుకొని ఫలితమును తెలుసు కొనుట చాలా కష్టముతో కూడుకున్న పని . జాతకులు పుట్టిన సమయమును బట్టి లగ్నము తెలుసుకోవాలి . లగ్నమునుండి 12 భావాలు ఏర్పడతాయి .  చాంద్రమాన సిద్దాంతము ప్రకారము ఒక సంవత్సరములో సుమారుగా 12  సార్లు భరణీ నక్షత్రము వస్తుంది. అందరి జీవితము ఒకేలా ఉండదు .

అంతెందుకు ఒకే రోజు భరణీ నక్షత్రము ఉన్న రోజున పుట్టిన ఏ ఇద్దరి జీవితము ఒకేలా ఉండదు . దీనికి కారణము రోజుకు 12 లగ్నములు ఏర్పడతాయి .  ఒకే నక్షత్రము ఉన్న రోజున జన్మించిన వారైనా వేరు వేరు లగ్నములలో పుట్టిన వారికి వేరు వేరు ఫలితములు కలుగును .   అదే విధముగా జాతక చక్రములో ఉన్న గ్రహముల స్థితి , వీక్షణ , కలయిక మొదలగు అనేక విషయములు పరిశీలించాలి . ఏ ఇద్దరి గ్రహ స్థితి ఒకేలా ఉండదు కదా ?

మరియు వివాహ జీవితమును తెలుసుకోవాలంటే  కుటుంబ స్థానము , కళత్ర స్థానము , ఆయుస్థానము, లాభ స్థానము , మరియు వ్యయ స్థానము ను కూడా పరిశీలించవలసి ఉంటుంది .

పైన చెప్పబడిన స్థానములలో నైసర్గికముగా పాప గ్రహములు ఉన్న , పాప గ్రహముల దృష్టి ఉన్నా , పైన తెలిపిన స్థానాదిపతులు పాప గ్రములతో కలసి యున్న వివాహ అనతరము జాతకుని జీవితము రకరకాల సమస్యలను ఎదుర్కొన వలసి ఉంటుంది .

ఉదా : కుటుంబ స్థానములో పాప గ్రహ సంభందము కలిగితే పరుష పడజాలమును వాడడం , ఉద్రేకంగా మాట్లాడడం మూలముగా జీవిత భాగస్వామి మాటకు విలువ ఇవ్వక పోవడము జరుగుతుంది . కుటుంబము అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది . అత్త మామల పట్ల సరియైన మర్యాదను గానీ , ఆదరణను గానీ చూపించ లేరు .

ఏడవ స్థానమైన కళత్ర స్థానములో పాప గ్రహముల సంభందము ఉంటే భార్య భర్తల సంభందము సరిగ్గా ఉండదు . సరియైన సుఖమును అనుభవించ లేరు , ఈ సప్తమ స్థానములో సూర్యుడున్న జాతకుల జీవిత భాగాస్వామికి అహంకారము ఉంటుంది . శనియున్న జాతకులకు భార్యా భర్తలకు ఎడబాటు సంభవించడం , రాహువు ఉన్న వారికి ఒకరి పట్ల ఒకరికి అనుమానములు , అపోహలు ఏర్పడతాయి .

పైన చెప్పిన గ్రహములు స్వక్షేత్ర స్థితిలో గానీ ఉచ్చ స్థానములలో గానీ ఉన్నప్పుడు చెడు ఫలితములు కలుగవు . కావున నక్షత్రమును బట్టే కాకుండా ఈ పై విషయములన్నీ క్షుణ్ణంగా పరిశీలించి గానీ ఫలిత నిర్ధారణ చేయలేము . కావున బ్లాగు రీడర్స్ అర్ధం చేసుకోగలరు . 

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...