మూల నక్షత్రములో జన్మించిన వారు దైవజ్ఞానము
కలవారు .జరగబోవు విషయములను ముందుగానే ఊహించి చెప్పగలరు . అమాయకత్వము కలిగి ఉందురు
. అనర్గలముగా మాట్లాడగలరు . ఉపన్యాసములు చేయుదురు .కానీ
సభా పిరికి ఉండును . సాహసించి ఏ పనీ చేయరు . అంతా దైవ నిర్ణయమని తలచెదరు . ఏ విషయముల
నైనా విడ మరచి చెప్పగల నేర్పరులు . తాము నమ్మిన సిద్ధాంతములకు కట్టుబడి యుందురు .
అన్యాయము , అక్రమములను సహించలేరు .
విద్యా సంభంద విషయములలో చాలా తెలివైన వారు . ఏక
సంధాగ్రాహులు . విషయ పరిజ్ఞానము కలవారు . కానీ విద్యార్ధి దశలో
కొన్ని ఆర్ధిక పరిస్థితుల వలన గానీ , కుటుంబ పరిస్థితుల వలన గానీ విద్యకు ఆటంకము
ఏర్పడగలదు . ఈ సమయాన తల్లిదండ్రులు వీరిపట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొనుట అవసరము
.
నీతి , నిజాయితీ కలవారు . మోసములను తట్టు కొనలేరు
. భోధనా సంభంద వృత్తులలో స్థిర పడగలరు . కొంచెం గర్వము , అహంభావము కలవారు . వీరు
తమ జీవితములలో రెండు లేక మూడు వృత్తులను
చేపట్టగలరు . ధనమే ముఖ్యము అను భావము వీరికి ఉండదు . కుటుంబము , బంధువులు ,
స్నేహితుల పట్ల మంచి అభిప్రాయమును కలిగి ఉంటారు .అందరూ నీతిగా ఉండాలని కోరు
కొంటారు .
వీరు దైవమునకు సంభందించిన కార్యక్రమములలోనూ , ఆధ్యాత్మిక
కార్యక్రమములలోనూ ఎక్కువగా పాల్గొంటారు . దైవ సేవ , సమాజ సేవ చేయుటలో ముందుంటారు .
మాయా మర్మములు తెలియని వారు . వీరు అందరిని నమ్ముతారు . లౌకికము తెలియని వారు .
బంధువులు స్నేహితులు అందరూ దూరమవుతారు . వీరు చివరకు ఏకాకిగా మిగులుతారు.
స్వార్ధము , స్వాభిమానము కలవారిని అసహ్యించు కొందురు .
అన్యాయము , అక్రమాలను తట్టుకోలేరు. ఉన్నదానితో
తృప్తి చెందుతారు .ప్రగల్భములు పలికెదరు . చేసే పని తక్కువ చెప్పే సోది ఎక్కువగా
ఉంటుంది . అసూయ ద్వేషములు కూడా ఉంటాయి . ఈ నక్షత్రములో పుట్టిన వారిని వివాహము
చేసుకోన్నచో జీవితభాగస్వామి
తండ్రికి అనగా మామ గారికి దోషమని శాస్త్రము ద్వారా తెలియు చున్నది .
అయితే మూలా నక్షత్ర 4 వ పాదములో జన్మించిన వారికి
మాత్రమే ఈ దోషము వర్తించు చున్నది . కానీ 1 2 ౩ పాదములలో పుట్టిన వారికి వర్తించుట
లేదు . తదుపరి కుటుంబములో మొదటి సంతానము గా జన్మించిన వారికి ఇచ్చి వివాహము
జరిపించుట వలన కూడా పై దోషము వర్తించు చున్నది .
No comments:
Post a Comment