2013-08-08

విశాఖ నక్షత్రము – ఫలితము



విశాఖ నక్షత్రమున జన్మించిన వారు తెలివైన వారు . బుద్ది మంతులు , మంచి ఆచార సంప్రదాయములను కలిగి ఉందురు . మృదువుగా మాటలాడుదురు . ధనమునకై తాపత్రయ పడక పేరు ప్రఖ్యాతలు సంపాదించ వలెనను కోరిక కలిగి ఉందురు . తీర్ధయాత్రలు చేయుట వీరికి ఇష్టము . సున్నితమైన సుకుమార వంతమైన శరీరము కలవారు . ఇతరులను ఆకర్శించుకోను రూపము కలిగి ఉందురు . ధన వంతులు , బంధువుల పై ప్రేమ కలవారు .

మంచి విద్యాభ్యాసము చేయుదురు . ఈ నక్షత్రమున జన్మంచిన కొందరు గ్రహ శాస్త్రమును , ఖగోళ శాస్త్ర సంభంధమైన పరిశోధనలు చేయువారగుదురు. తనకు హాని తలపెట్టిన వారిని గుర్తించుకొని మరీ వారిపై పగ తీర్చుకొంటారు . భార్య భర్త వైవాహిక జీవితములో  కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు . ప్రతి విషయమును చాలా దీర్గముగా ఆలోచించుట వలన ఇబ్బందులు తప్పవు . చిన్న చిన్న విషయములను కూడా భూతద్దములో పెట్టి చూస్తారు . తొందరగా మరచిపోరు . వితండ వాదము చేస్తారు .    

వీరు పరిశీలనా జ్ఞానము కలవారు . ఇతరుల పై జాలి దయ కలిగిన వారే కానీ అసూయ పరులు . అన్నింటా తామే ముందుండ వలెనని అనుకొందురు. జయాపజయములను సమానముగా స్వీకరించ లేరు . మనో నిగ్రహము కలవారు . జాగ్రత్త పరులు . అవసరమునకు మించి జాగ్రత్త వహించుట వలన పిసినారులని అనబడుదురు .వయస్సు పెరిగే కొలది మంచి సంస్కారము అలవడును . పెద్ద మనుషులుగా రాణిస్తారు .

రాజకీయ వ్యవహారములలో పదవులను చేపట్టుట , సంభందిత వ్యవహారములలో పాల్గొనుచుందురు . ధన సంపాదన బావుండును. రెండు లేక మూడు విధములుగా ఆదాయము వచ్చే విధముగా ఏర్పాట్లు చేసుకొందురు. లక్ష్మీ కటాక్షము ఉండును. తొందరగా ముసలి వారగుదురు . అనగా తక్కువ వయసే అయినప్పటికీ ముదుసలి స్వరూపము వలె కన్పింతురు. కొంత హంగు ఆర్భాటములను ప్రదర్శించడం , తమ గురించి తామే గొప్పలు చెప్పుకోవడం వీరికి అలవాటు .    

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...