జ్యోతిష్య శాస్త్రము భారత దేశములో సనాతన సాంప్రదాయము లలో ఉత్తమ మైనది.
మానవుడు ధర్మ బద్దుడై భక్తి భావముతో
నడచుటకు ఈ శాస్త్రము ఉపయోగ పడుచున్నది . ఎందరో పుణ్య పురుషుల తపో బలము చే ఈ
శాస్త్రము రూపుదిద్దు కున్నది .
పరాశరుడు , వరాహ మిహిరుడు , కాళిదాసు , యవనులు , మంత్రేశ్వరుడు, కళ్యాణ
వర్మ , వైద్యనాధుడు ఇంకనూ అనేక మంది {మహర్షులు
}పుణ్యపురుషులు గ్రహ శాస్త్రమును అధ్యయనము
చేసినారు . వీరందరూ ఒకే కాలము లో పుట్టిన వారు కాదు . వారి వారి జీవితములో పరిశోధన
చేసి మానవుని జీవితములో కలుగు పరిణామముల గురించి , సృష్టిలో కలుగు అనేక మార్పులు
గురించి , వాతావరణ సూచనలు తెలుసు కొనుట మొదలగు విషయములను వివరించినారు . సమాచార
సాంకేతిక విజ్ఞానము లేని రోజుల్లోనే వీరు అనేక విషయములను కనుగొని మానవాలికి
అందించినారు. పాశ్చాత్య సంస్కృతి ప్రభావమో, ప్రస్తుత కాలములో వస్తున్న మార్పుల
ప్రభావము చేతనో ఏమో గానీ ఈ శాస్త్రము కొంత
అవహేలనకు గురియగు చున్నది.
ఉదా : పూర్వము తాటి యాకుల గ్రంధము పై వ్రాసేవారు , కొంత కాలమునకు
కాగితము కనుగొన్నారు. తాటి ఆకుల గ్రంధము నకు బదులు పుస్తకము లలో సమాచారము ను
దాచుకొన్నాము .ఈ నాడు కంప్యూటర్ ల లోనూ. ఇంకా ఆన్ లైన్ లోనూ సమాచారమును ఉంచుకోవడం
జరుగుతుంది . ఈనాటి పిల్లలకు చాలా మందికి తాళపత్ర గ్రంధముల గురించి తెలియదు . అలా
అని తాళపత్ర గ్రంధములే లేవని చెప్పలేము కదా ?
ఉదా : పూర్వము ఆయుర్వేద వైద్యము భారత దేశములో ప్రసిద్ది గాంచినది. ఎన్నో
రకాల పరిశోధనల తరువాత ఇంగ్లీషు వైద్యము అందుబాటులోకి వచ్చింది. ఇంగ్లీషు వైద్యములో
ఉపయోగించే మందులు కూడా వన మూలికలతో తయారైనవే కదా ? అలాంటప్పుడు ఆయుర్వేద వైద్యమే
లేదని అనలేము కదా ?
మహర్షులు అధ్యయనము చేసిన ఆ కాలములో మానవునకు ఉన్న కట్టుబాట్లు విధి
విధానములను అనుసరించి ఫలితములు తెలియ పరచే వారు. ఆనాడు వ్యవసాయ ఆధారితము.. ఈ నాడు కుల వృత్తులు లేవు . ప్రపంచము అంతా ఎంతో
వేగంగా మారిపోవుచున్నది .కుల వృత్తులు లేవు . అనేక రకముల వృత్తులు పుట్టుకొచ్చాయి
. ఎవరికీ ఇష్ట మొచ్చిన వృత్తిని వారు చేపట్ట వచ్చు . ఇలాంటి సమయములో ఈ శాస్త్రము
ద్వారా జ్యోతిష్యులు చెప్పిన కొన్ని ఫలితములు యధార్ధము గాక పోవుట వలన మొత్తం
శాస్త్రము నే అవమాన పరచు చున్నారు . ఎందరో
మహర్షులు అధ్యయనము, అన్వేషణల ద్వారా తెలియ పరచిన జ్యోతిష్య శాస్త్రమును నిత్యమూ
పరిశోధన చేయడం వలన మాత్రమే మానవాళికి మరింత సమాచారమును అందించ గలము .
No comments:
Post a Comment