2013-08-08

మనిషి – జీవితము



మనలో చాలామంది కష్ట నష్టములు ఎదురైనపుడు , లేక ఆర్దికముగా పరిస్థితులు తారుమారైనపుడు అంతా కర్మ ఫలమనీ , దశ బాగు లేదనీ అంటుంటారు.  అది నిజమే కావచ్చు . కానీ daily life లో కొన్ని జాగ్రత్తలు పాటించడం , కొన్ని పద్ధతులను అనుసరించడం వలన life లో హాయిగా జీవించుటయే కాక  ఆయువును పెంచుకోవచ్చు .
                                      
మనిషికి మరణము అనేది EXPIRY DATE . ఈ సృష్టిలో ప్రతి వస్తువుకు EXPIRY DATE ఉంటుంది . అలాగే మనిషికి కూడా ? మనిషి బ్రతికి ఉంటేనే సుఖము , ఆనందము , హోదా , గౌరవము , అధికారము , అన్నీ . బ్రతుకే లేనప్పుడు ఇవన్నీ వృధా . కావున మనిషి సాధ్యమైనంత వరకు తన EXPIRY DATE ని  పొడిగించు కోవడానికి ప్రయత్నించాలి . LIFE ప్రధానము.

ఉదా: ఒక Two Wheeler కొన్నాం . దానికి 15 years life తో కంపెనీ వారు మార్కెట్లో release చేసారు . Drive చేసే వ్యక్తి పై దాని LIFE ఆధారపడి ఉంటుంది . ఇష్టం వచ్చి నట్లు HIGH SPEED తో నడపడం వలన ACCIDENTS జరగడం VEHICLE నాశనమవడం లాంటివి జరుగుతాయి . అదే పనిగా అవసరం ఉన్నా లేకున్నా వాడడం వలన TYRES , VEHICLE PARTS లో అరుగుదల వచ్చి REPAIRS రావడం జరుగు తుంది . MAITENENCE  బాగు లేక పోయిన VEHICLE  పాడవుతుంది . అడ్డదిడ్డంగా DRIVE చేయడం వలన కూడా ACCIDENTS జరుగుతాయి .

అలాగే భగవంతునిచే కలిగిన జన్మకు ఆయువు పెరిగే విధముగా మనిషి ఆహారపు అలవాట్లు , నడక , నడత , ప్రవర్తన , ఆలోచన బాగుండాలి . జ్యోతిష్య శాస్త్రము ప్రకారము మానవుని ఆయుష్షు 120 YEARS గా చెప్పబడినది . ఈ నాటి మనిషి 60 , లేక 70 సంవత్సరముల కన్నా ఎక్కువ కాలము జీవించుట లేదు . 35 సంవత్సరములు దాటే టప్పటికి SUGAR , BLED PRESSER లాంటి అనేక రకముల రోగములతో భాద పడు చున్నారు . విపరీతమైన ఒత్తిడికి గురి యగుచున్నారు . తద్వారా మానసిక ఆనందము , శారీరక సౌఖ్యములు లేక అనేక ఇబ్బందులను ఎదుర్కొను చున్నారు .    

ఈనాటి మానవునకు తృప్తి లోపించు చున్నది . ధన సంపాదన కొరకు ఆరాటము పెరిగి పోయినది . విశ్రాంతి లేకుండా పగలు రాత్రి తేడా లేకుండా నిరంతరము శ్రమించు చున్నాడు . ధనమేరా అన్నింటికీ మూలము అను సామెత చెప్పినట్లు ప్రవర్తించు చున్నాడు . ఏమి అని అంటే పోటీ ప్రపంచము ఇలా కాకపొతే బ్రతకలేమేమో అని కట్టు కధలు చెప్పుచున్నారు . ఇంత ఆరాటపడి తాము ఏమి కోల్పోతున్నామో గ్రహించ లేక పోవుచున్నారు .

పైన VEHICLE  గురించి చెప్పుకొన్నాం . REST లేకుండా పని చేయకండి . తగినంత విశ్రాంతి తీసుకోవడం ,క్రమ శిక్షణ కలిగిన విధముగా నడచు కోవడము , మంచి ఆహారపు అలవాట్లు , సత్ప్రవర్తన కలిగి ఉండుట వలన LIFE TIME ని పెంచుకోవచ్చు .    

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...