హస్త నక్షత్రమున జన్మించిన వారు ఓర్పు సహనము
అధికముగా కలవారు . శాంతము వహింతురు . నిదానముగా ఆలోచిస్తారు .ప్రణాలికా బద్దముగా
వ్యవహరిస్తారు . సున్నిత మనసు గలవారు . ఆప్తులను ఆదుకొందురు . స్నేహితులు ఎక్కువగా
ఉంటారు . వీరికి నచ్చని విషయములను నిర్మోహమాటంగా వ్యతిరేకించెదరు . మొండి తనము
కలవారు . ఎన్ని కష్టములు ఎదురైనా భయపడరు . ఓర్పుతో సాధించుకొంటారు .
వీరు ఫలితమును ఆశించక తమ పని తాము చేసుకొని
పోతారు . కష్టే ఫలీ అను సూత్రమును నమ్ముతారు . తాము నమ్మిన సిద్దాంతములకు కట్టుబడి
ఉంటారు . ఇచ్చిన మాట తప్పరు. ఉదార స్వభావము కలవారు . పేదవారిని ,బీద వారిని ఆదు
కొందురు . దయార్ద్ర హృదయము కలవారు . సాధారణముగా వీరు పిత్రార్జితమును కలిగి ఉందురు
. అట్లు లేకున్నా వీరు స్వార్జితముగా అభివృద్ది లోనికి వస్తారు .
బాల్యమున కొద్ది రోజులు అనగా రాహు మహాదశా సమయములో
కొన్ని కష్ట నష్టములను ఎదుర్కొంటారు . అనంతరము వీరి జీవితము సుఖముగా సాగుతుంది .
వీరికి వివాహమూలమున జీవితభాగస్వామి వలన భాగ్యము వృద్ధి చెందును . వివాహ అనంతరము
మంచి సుఖమయ జీవితమును గడిపెదరు . స్త్రీల పట్ల మమకారము ఎక్కువగా ఉంటుంది . స్త్రీ
వాంఛ అధికము . వీరికి పురుష సంతతి ఎక్కువగా ఉంటుంది . మంచి సంతానము కలుగుతుంది .
ఆచార సంప్రదాయముల పట్ల మక్కువ కలిగి ఉంటారు .
సంగీత సాహిత్య రంగములలో ప్రవేశము ఉంటుంది . ఇతరులకు చేతనైతే ఉపకారము చేయుదురు కానీ
అపకారము తలపెట్టరు. ఎప్పుడూ ఏదో ఒక
వ్యాపకముతో ఉంటారు . కాలాన్ని వృధా చేయరు .మంచి ఆకర్షణీయ రూపము కలిగి ఉందురు .
వయస్సు తక్కువైనా చూచుటకు పెద్దవారి వలె కన్పింతురు .మధ్యవర్తిత్వము చేయుటకు బాగా
పనికి వస్తారు . ఈ నక్షత్రమున జన్మించిన వారిలో ఎక్కువ మంది స్వతంత్రజీవనమును
కోరుకొంటారు .
అప్పజెప్పిన పనిని భాద్యతగా నిర్వహింతురు .
నలుగురిని కలుపుకొనుపోవు లక్షణము కలవారు . మాయామర్మములు తెలియని వారు. ఆనందమైనా ,
భాదనైనా ఒకేలా స్వీకరిస్తారు . సభల యందు మాటలాడలేరు . కుటుంబ బరువు భాద్యతలలో
భాగస్వాములవుతారు . గౌరవ మర్యాదలను పొందుతారు . మధ్య వయసు నుండి వీరి జీవితము
అంచెలంచెలుగా ఉన్నత స్థితికి చేరుతుంది . మంచి విద్యా వంతులు , భోగ భాగ్యములను
అనుభవించువారు. ఏ పనినైనా ఇష్టముగా చేయుదురు .
No comments:
Post a Comment