2013-08-07

స్వాతి నక్షత్రము – ఫలితము



స్వాతి నక్షత్రములో పుట్టిన వారు మృదు స్వభావము కలిగి ఉందురు . పరిశీలనా శక్తి కలవారు . సహనముతో వ్యవహరింతురు . ప్రతి విషయము లోనూ ప్రత్యేక దృష్టి కలిగి ఉందురు . వీరిని తృప్తి పరచుట కష్టం . వీరు చిన్నతనములో అనేక కష్ట నష్టములను ఎదుర్కొందురు. సత్ప్రవర్తన కలవారు . ఉన్నతాశయములు కలిగి ఉందురు . వీరికి విధ్యాభ్యాస కాలమునందు ఆటంకములు కలుగును .. తదుపరి విద్య కొనసాగును .ఈ నక్షత్రమున జన్మించిన వారు గొప్ప గొప్ప పదవులను , అధికారములను చేపట్టు అవకాశములు ఉన్నవి .

ఆదర్శవంతమైన జీవితమును గడిపెదరు . ఇతరులకు మార్గదర్శకులగుడురు . సమాజమున సంఘ సంస్కర్తలుగా రాణింతురు, ధార్మిక సంస్థలయందునూ , మత సంభంద వ్యవహారములలోనూ ప్రచార కర్తలుగా రాణిస్తారు . నమ్మిన సిద్ధాంతములకు కట్టుబడి ఉంటారు . దైవ భక్తీ అధికము . క్రమ శిక్షణ గల జీవితము వీరి సొంతము . క్లిష్ట సమస్యలు ఏర్పడి నపుడు ఇతరులు, లేక తన శ్రేయోభిలాషులైన వారి మాటలను వినరు . తమకు తోచిన విధముగా మొండిగా ప్రవర్తింతురు. మొండి తనముగా వ్యవహరించుట వలన కోరి కష్టములను కొనితెచ్చు కొందురు .

ఎదుటివారిని అర్ధం చేసుకొనక దురుసుగా మాటలాడుదురు . కంటితో చూస్తే గానీ ఏదీ నమ్మరు . వితండ వాదం చేస్తారు . ఆధ్యాత్మిక చింతన చాలా ఎక్కువగా ఉంటుంది . దైవమునకు సంభందించిన కార్య క్రమములను పాల్గొనడము , నాయకత్వము వహించి సంభందిత కార్యములను నడిపించడం వీరికున్న ప్రత్యేకత. శాస్త్ర పరిశీలనా జ్ఞానము కలవారు. ఎత్తుకు పైఎత్తు వేసి ఇతరులను లోబరచుకొందురు . ధన సంపాదన బాగుంటుంది . వీరికి పాతది అయిన గృహము గానీ , పూర్వీకులచే నిర్మింప బడిన ఇల్లు గానీ లభించును .

ఆస్తులపై మక్కువ ఎక్కువ . లౌకికముతో చాకచక్యముగా వ్యవహరింతురు . కుటుంబ సౌఖ్యము కలవారు . బంధువుల స్నేహితుల పట్ల మంచి ఆదరణ కలిగి ఉందురు . భోగ భాగ్యములను అనుభవింతురు. ప్రజాభిమానము కలవారు . విశాల హృదయము కలవారు . కళలు , సంగీత సాహిత్యములన్న ఇష్టము కలిగి ఉంటారు . నటనా కౌశల్యము కలవారు .         

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...