2013-08-14

గ్రహములు – దిక్కులు



సూర్యుడు తూర్పు దిక్కునకు, శుక్రుడు ఆగ్నేయ దిక్కునకు, కుజుడు దక్షిణ దిక్కునకు, రాహువు నైరుతి దిక్కునకు, శని పడమర దిక్కునకు , చంద్రుడు వాయువ్య దిక్కునకు, బుధుడు ఉత్తర దిక్కునకు, గురుడు మరియు కేతువు ఈశాన్య దిక్కునకు , బలవంతులు
దిక్కులకు పాలకులు

తూర్పు దిక్కుకు ఇంద్రుడు , ఆగ్నేయ దిక్కుకు అగ్ని దేవుడు, దక్షిణము నకు యముడు , నైరుతి కి నిర్రుతి అను రాక్షసుడు , పశ్చిమము నకు  వరుణుడు వాయువ్యము నకు వాయుదేవుడు, ఉత్తరము నకు కుబేరుడు , ఈశాన్యము నకు ఈశానుడు ( పరమేశ్వరుడు ) అధిపతులు .

ఈ దిక్కుల ప్రస్తావన వాస్తు శాస్త్రమున ఉపయోగపడును
ఈ భూమిపై నివసించు ప్రతి వ్యక్తికీ గృహము అవసరము . గృహము ఎల్లప్పుడూ సుఖ సంతోషము లతో పిల్లా,పాప లతో కళకళలాడుతూ ఉండాలి , అట్టి గృహము నిర్మాణము చేయుటకు అనుసరించ వలసిన పద్ధతిని వాస్తు శాస్త్రము మనకు తెలియ పరచు చున్నది .

గృహము నందు ఈశాన్య దిశ లో సాధారణంగా ఖాళీ ఉంచుట మంచిది .ఈ దిక్కులో బావి లేక బోరింగు ఏర్పాటు చేసుకోవలెను . ఈ విధముగా చేయుట వలన గృహము నందు నివసించు వారికి మానసిక ప్రశాంతత కల్గును . తూర్పు దిశలో సాధ్యమయినంత ఖాళీ ఉంచుతూ తేలిక పాటి వస్తువులను ఉంచుట మంచిది . ఇట్లు చేయుట వలన ఇంద్ర సమాన భాగ్యములు కలుగును . ఆగ్నేయ దిశలో పొయ్యిని పెట్టవలెను .ఈ దిశ లో హెచ్చు తగ్గులు లేకుండా గృహ నిర్మాణము చేయవలెను . అట్లు కాని యెడల స్త్రీలకు రక్తప్రద రోగము కలుగును . కోర్టు గొడవలు , తగాదాలు ఏర్పడును .

దక్షిణ దిశలో బరువైన సామాగ్రి ఉంచవలెను . నైరుతి దిక్కున గృహ యజమాని పడక గదిని ఏర్పాటు చేసుకోవలేను. ఈ దిశ లో హెచ్చు తగ్గులు లేకుండా ఇల్లు కట్ట వలెను , లేని యెడల ఇంట్లో అనేక సమస్యలు ఏర్పడును . కుటుంబ సభ్యులలో ఎవరో ఒకరికి ఎప్పుడు అనారోగ్యము కలిగి ధనము వృధా వ్యయము జరుగును .

పశ్చిమ దిక్కునందు బీరువాలు మొదలగునవి . ధనము దాచుకొను ఇనుప పెట్టెలు మున్నగునవి ఉంచవలెను .
వాయువ్య దిశలో మరుగు దొడ్లు ఏర్పాటు చేయాలి . ఈ దిక్కులో ఏ విధమైన తేడాలు లేకుండా ఏర్పాటు చేయవలెను . లేని యెడల సంతాన నష్టము కల్గును . గర్భ స్రావములు కల్గును .
ఉత్తర దిశలో మంచి ఆహ్లాదకరము గా ఉండేటట్లు ఈ భాగము ను ఎంత పరి శుభ్రముగా ఉంచిన అంత మంచిది . ఈ విధముగా ఉండుట వలన ఐశ్వర్యము కలిగి గృహమునందు నివాసము చేయువారు సుఖ , సంతోషములను పొందెదరు .   ,    

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...