2013-08-15

కుజ దోషము – నివారణ



కుజ దోషమును గూర్చి అనేక విధములు గా చెప్పు కొన్నాము . కుజ దోషము ఉన్న జాతకుల కు ఆలస్య వివాహములు జరుగు చున్నవి . కొందరికి నిశ్చయమైన సంబంధములు కూడా తప్పి పోవు చున్నవి . మరి కొందరికి యవ్వనములో  తొందరగా వివాహము జరిగి నప్పటికీ దాంపత్య జీవితములో అనేక సమస్యలు ఏర్పడు చున్నవి. ఇటువంటి సంఘటనలు జరుగ కుండా పరిష్కారములు లేవా?

అని ఆలోచిస్తే శాస్త్రీయమైన పరిష్కారము దొరుకుట లేదు . కానీ వధూ వరులు ఇద్దరికీ కుజ దోషము ఉన్నప్పుడు వివాహము చేయ వచ్చునని . ఒకరికి కుజ దోషము ఉండి మరియొకరికి కుజ దోషము లేనప్పుడు వివాహము చేయరాదనీ , అట్లు చేసిన యెడల దంపతుల జీవితము సమస్యలతో ఉండుననీ మహర్షులు చెప్పితిరి .

మరియు కుజ దోషము వలన సమస్యలు ఏర్పడి నపుడు భార్య భర్త ఇరువురి మధ్య మానసిక సంసిద్దత అవసరము . ఒకరి పట్ల ఒకరు ప్రేమానురాగాములు పెంచుకొని , ఒకరికొకరు అర్ధము చేసుకొని నడచుకోనుట వలన కొంతవరకు సమస్యల నుండి బయట పడవచ్చు .

హిందూ సాంప్రదాయ పద్ధతిలో కుజ దోష నివారణ కు శాంతి ఉపాయములు చెప్పినారు .
కుజుడు శక్తి స్వరూపుడు . అధిదేవత కుమారస్వామీ . { సుబ్రహ్మణ్య స్వామీ ).  జాతకము నందు కుజ దోషము ఉన్నప్పుడు  కుజ గ్రహ జపము చేయుట , కుజ యంత్రమును ధరించుట , సుబ్రహ్మణ్య స్వామిని పూజించుట ,వలన కుజ దోషము తొలగి జాతకులకు వివాహము జరుగుననీ , కుటుంబము నందున్న సమస్యలకు పరిష్కారము లభించుననీ తెల్పితిరి .

కుజుడు శ్లోకం  : ధరణీ గర్భ సంభూతం , విద్యుత్ కాంతి సమప్రభం
                  కుమారం శక్తి హస్తం తమ్ మంగళం ప్రణమామ్యహం ..

తాత్పర్యము : భూమి యొక్క గర్భమునుండి జన్మించిన వాడవు , విధ్యుత్ కాంతి తో సమానమైన వాడవు ,సుబ్రహ్మణ్య స్వామీ స్వరూపమై శక్తిని చేత ధరించిన వాడవు అయిన మంగలుడా నీకు నమస్కారము .
ఈ శ్లోకమును ఏడు వేల సార్లు జపించ వలెను .

మరియు వివాహ యోగము సంప్రాప్త మగుటకు శుక్రుడు అనుగ్రహము ఉండాలి . కుజ దోషము వలన వివాహమునకు ఆటంకాలు ఏర్పడితే  శుక్ర గ్రహ ప్రతి రూపమైన వజ్రమును ధరించుట వలన కూడా వివాహము జరుగుననీ చెప్పబడు చున్నది . ,

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...