జాతక చక్రములో శని దోష స్థానములో ఉన్నప్పుడు ఏ
విధమైన ప్రభావము ఉంటుంది అనే విషయమును గురించి తెలుసుకొందాం .
లగ్నము నందు శనియున్న జాతకులు వికార రూపము కలవారు
. నల్లగా ఉండడం , బలహీన కండరములు , ఊబకాయులు ( గుల్ల శరీరము ) లేక శరీరముపై నరములు
తేలి ఉనట్లు సన్నగా ఉండడం లాంటి లక్షణములు కలుగజేస్తాడు . లగ్నము నందు శనిగ్రహము
స్థితి పొంది ఉండగా పుట్టిన వారు నీరసముగా ఉంటారు . యాక్టివిటీ తక్కువగా ఉంటుంది .
చాలా నెమ్మది స్వభావము కలిగి ఉందురు . కొందరికైతే అవయవ లోపము ఉంటుంది .( అవిటివారు
) వీరు సాధారణముగా శ్వాసకోస సంబంధ వ్యాధులు ఉబ్బసము , పడిశము , ఆస్తమా , పిట్స్
మొదలగు రోగములచే భాద పడు అవకాశమున్నది . శరీరములో రోగ నిరోధక శక్తి తక్కువగా
ఉంటుంది .
రెండవ
స్థానము. ఈ స్థానము కుటుంబము , ధనము, వాక్కు , నేత్రములు మొదలగు వాటిని సూచించును.
ఇక్కడ శనిగ్రహము ఉన్నస్థితి కలిగిన జాతకులు
ధన సంపాదన విషయములో అనుకొన్న లక్ష్యములను చేరలేరు . సమయానికి డబ్బు చేతికి అందదు .
నలుగురిలో మాటలాడలేరు . వీరు కుటుంబములో ప్రశాంతత ను కోల్పోతారు . సభాపిరికి ,
కొందరికి మెల్లకన్ను ఉండు అవకాశము ఉన్నది . కొందరికి ప్రేమ వివాహము గానీ ఇంటర్నల్
ఎపైర్స్ , ఇంటర్ కేస్ట్ మేరేజ్ జరుగుతుంది . కొన్ని విషయములలో ఇతరులకు లోబడి
ఉండాల్సిన అవసరము ఉంటుంది .
౩వ ఇంట శనిగ్రహము ఉన్నవారు యోగ కరమైన జీవనము
గడుపుతారు . కొందరికి చెవుడు కలుగును . వినికిడి శక్తి తక్కువగా ఉంటుంది .
తమ్ముళ్ళు నశింతురు . అలా కాని పక్షమున వివాహము జరిగిన వెంటనే వీరు కుటుంబ
భాధ్యతలను విస్మరించి వేరు కాపురం పెడతారు .
4 వ ఇంట శనిగ్రహము ఉన్న జాతకులు విద్యకు అవరోధము
ఏర్పడును . వీరు విద్యా పరంగా ఉన్నత స్థానములో ఉండటానికి చాలా కష్ట పడవలసి
వస్తుంది . గృహ సౌఖ్యము ఉండదు . పాత ఇల్లు గానీ లేక ఎవరో నిర్మించిన ఇల్లు
కొనుక్కోవడం గానీ జరుగుతుంది . తమ స్వహస్తాలతో గృహమును నిర్మించు కాలేరు .
బంధువులు సరియైన ఆదరణ ఉండదు . వీరికి మాతృ సౌఖ్యము తక్కువ . . ఉన్నత స్థానములను
చేరుటకు చాలా కాలము పడుతుంది . ఇతరులతో ముభావముగా ఉంటారు . ఏకాకి జీవితమును గడుపుటకు
ఇష్ట పడతారు .
5 లో శనిగ్రహము ఉన్న జాతకులు మంద బుద్ది కలవారు .
వీరికి సంతానము ఆలస్యముగా కలుగుతుంది . వివాహము కూడా ఆలస్యముగా జరుగుతుంది . ఒకవేళ
తొందరగా వివాహము జరిగి వెంటనే సంతానము కలిగితే మాత్రం అబార్షన్ జరగడం గానీ ,
పుట్టిన శిశువు మరణించడం గానీ జరుగుతుంది . పుట్టిన పిల్లలలో బుద్ది మాంద్యము
కలుగు అవకాశములు ఉన్నవి . వీరిలో చురుకు తనము తక్కువగా ఉంటుంది .
6 లో శనిగ్రహము ఉన్నప్పుడు పుట్టిన వారు
.జాయింట్స్ ,కండరములు, మరియు వాత సంబంధ రోగములతో భాధ పడతారు . మిగతా విషయములు
అన్నింటిలో చాలా బాగుంటుంది . వీరు కోర్టు సంభంధ వ్యవహారములలో ఇరుక్కోకుండా ఉండడం
మంచిది . లేని యెడల దీర్ఘ కాలము శిక్షలు అనుభవించు అవకాశాలు ఎక్కువ .
No comments:
Post a Comment