2013-09-21

శని గ్రహము - సమస్యలు

జాతక చక్రములో శని దోష స్థానములో ఉన్నప్పుడు ఏ విధమైన ప్రభావము ఉంటుంది .

ఏడు లో శనిగ్రహము ఉన్న జాతకులకు ఆలస్య వివాహము జరుగుతుంది. తొందరగా పెండ్లి సంబంధములు కుదరవు . కొంతమందికి కులాంతర వివాహము , ప్రేమించి పెళ్లి చేసుకొనే అవకాశములు ఎక్కువగా ఉంటాయి . కానీ భార్యా భర్త ఇద్దరి మధ్యా అన్యోన్యత లోపించును . ఒకరి పట్ల ఒకరు విధేయత కలిగి ఉండరు . వీరిలో కొందరికి రెండు వివాహములు జరగడం గానీ ( పెళ్ళైన వారికి మళ్ళీ పెళ్లి జరగడం ) లేక అక్రమ సంబంధములు ఉండడం గానీ జరుగుతుంది . దాంపత్య జీవితములో సమస్యలు ఎక్కువగా ఉంటాయి . ఒకవేళ సంప్రదాయము ప్రకారము వివాహము జరిగితే జీవిత భాగస్వామికి అనుకోని ప్రమాదములు సంభవించు అవకాశములు ఉంటాయి .

ఎనిమిది స్థానములో శని ఉన్నప్పుడు పుట్టిన వారికి మంచి ఆయుర్దాయము కలుగుతుంది . వృద్దాప్యము లో పనికొచ్చే విధంగా ముందు చూపుతో ధనమును పొదుపు చేస్తారు . ప్రణాలికా బద్దంగా ముందుకు వెళతారు . దీర్ఘ కాలము బ్రతుకుతారు . కానీ మరణ సమయములో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు . పక్షవాతం లాంటి జబ్బులతో ఎక్కువ కాలం భాదపడి చనిపోతారు .

తొమ్మిదవ ఇంట శని గ్రహ స్థితి ఉన్నప్పుడు జన్మించిన జాతకులు తండ్రి , తాతల తాలూకా ఆస్తులను కోల్పోతారు . వాటిని అనుభవించలేరు . వీరికి కుటుంబ పరంగా గుర్తింపు ఉండదు . తాత , తండ్రుల యొక్క వంశ పారంపర్య చరిత్ర ఉండదు .అనగా వీరి వంశములో పూర్వీకులు గొప్ప వారెవ్వరూ ఉండరు . సాధారణ జీవితమును గడుపుతారు . జాతకులు మాత్రం స్వశక్తితో అభివృద్ది లోకి వస్తారు . వీరే స్వయంగా స్వార్జితముగా ధన సంపాదన చేయుదురు . పేరు ప్రఖ్యాతలు గడించు కొంటారు . ఆర్ధికముగా స్థిర పడతారు .

పదవ స్థానమున శనియున్న జాతకులు మొదట సాధారణ జీవితమును గడిపెదరు . జీవితములో ఒక మెట్టు , ఒకమెట్టు ఎక్కుతూ అంచెలంచెలుగా ఉన్నత స్థానములకు చేరుతారు . వీరికి ఏదీ సునాయాసముగా లభించదు . ఎంతో కష్ట పడితే గానీ జీవితమున అభివృద్ధి సాధించలేరు . ‘’ కష్టే ఫలీ’’ అను సూత్రము వీరికి వర్తించును . వీరు ఎంతో కష్ట పడి సాధించిన విజయములు వీరికి కీర్తిని గడించి పెట్టును . దీర్గ కాలము పాటు వీరిని అందరూ గుర్తించు కొంటారు .

పదకొండవ స్థానమున శనియున్న జాతకులు ఆశించిన లాభములను పొందలేరు . వీరు అనుకొన్న లక్ష్యములను సాధించుటకు చాలాకాలము పట్టును . వీరు ఒంటరిగా కాకుండా సమిష్టి గా పని చేయుట , పోరాడుట వలన ఎక్కువ లాభములను పొందగలరు . ( గ్రూప్ మేనేజ్ మెంట్స్ ) వీరికి కలసి వస్తాయి . పని వారి వలన సేవకా వృత్తి వలన , టీం మేనేజ్ మెంట్స్ మొదలగు వాటివలన వీరు విరివిగా లాభపడే అవకాశములు ఎక్కువ .

పన్నెండవ స్థానమున శని గ్రహము ఉంటుండగా పుట్టిన జాతకులకు ఎక్కువగా బరువు భాద్యతలు ఉంటాయి . వీరికి సుఖము తక్కువనే చెప్పాలి . వీరికి ప్రతి విషయములోనూ ఆటంకములు ఎదురగు చుండును . ఎంతో శ్రమకు ఓర్చవలసి ఉంటుంది . భార్య భర్తల మధ్య సయోధ్య ఉండదు . జీవిత భాగస్వామికి లోబడి ఉండాలి.  స్వతంత్రత ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో భాధ పడుతూ ఉంటారు . అతి నిద్ర, బద్దకము , నీరసము ఆవహించడం , నరముల నిస్సత్తువతో భాధ పడతారు .

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...