2013-09-19

పచ్చ (Emerald)

బుధ గ్రహ ప్రతిరూపము పచ్చ .నెమలి కంఠము రంగు , నాచు రంగు గాజు పచ్చ గరిక గడ్డి రంగులలో లభించును .
ఇది ఎనిమిది రకములుగా ఉంటుంది . దిరిసిన పువ్వు వలె , పాల చెట్టు రంగు , చిలుక రెక్కల రంగులా ప్రకాశ వంతముగా మెరుస్తూ ఉంటుంది . దీనిని ధరించుట వలన చేయు వృత్తి, వ్యాపారముల యందు అధిక ధన లాభము అన్నింటా విజయము కలుగును . ముఖ్యముగా వ్యాపార రంగములలో ఉన్న వారికి విశేష యోగమును కలుగ జేయును .

బుధుడు సర్వ శాస్త్రములకు అధిపతి. కావున బుద్ధికుశలత కలుగును . గణిత శాస్త్రము నందు రాణింతురు.
బుద్ది బలము పెరుగును. వ్యాపారములో నూతన పద్ధతులను అవలంబించి విశేష ధనార్జన పరులగుడురు .

సంఖ్యా శాస్త్రము ప్రకారము బుధుడు సంఖ్య - 5

ఇంగ్లీషు నెలల ప్రకారము 5, 14, 23, తేదీలలో పుట్టినవారు , ఆశ్రేష , జ్యేష్ట , రేవతి నక్షత్రములలో జన్మించిన వారు  మిధునరాశి , కన్య రాశిలో జన్మించిన వారు మిధున , కన్య లగ్నంలో పుట్టిన వారు ఈ రత్నమును ధరించుట వలన అద్భుతమైన యోగములు పొందుదురు.

పచ్చ ఈ రత్నమును ఎండలో సూర్యునికి ఎదురుగా పెట్టినపుడు పచ్చని కాంతి నాలుగు వైపులా ప్రసరించును.
ఒక తెలుపు వస్త్రముపై బంగారము , తెలుపు రంగులో ఉన్న రత్నము, పచ్చను ఒక దగ్గర పెట్టిన పచ్చగా కన్పించును .ఈ రకమైన పచ్చ శ్రేష్టమైనది . ఆకుపచ్చ రంగులో ఉన్న పచ్చను గరుడ పచ్చ అని అంటారు. ఇట్టి పచ్చను ధరించుట వలన తేజస్సు పెరుగును . దీనిని రాతిపై అరగదీసిననూ అరగదు . పచ్చకు జీడిని పట్టించి శుభ్రముగా కడిగినపుడు అంతకు ముందు కన్నా ప్రకాశ వంతముగా కనపడును .   .

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...