2013-09-23

గోమేదికము(garnets)

ఆవు మూత్రము రంగులో ఉండుట వలన దీనిని గోమేదికము అని అంటారు .
ఈ రత్నము స్ఫటిక జాతికి చెందినది . ఇది నీటి అడుగున గులక రాళ్ళలో నది ప్రవాహముల లోను దొరకును . కంకర రాళ్ళలో కూడా లభించును . గోమేదికమును అధిక ఉష్ణోగ్రతలో వేడి చేసినపుడు దాని బరువు తగ్గి పోవును . వేడి తగిలినపుడు మెరుపు వంటి కాంతి పుట్టును .

దీనిలో తెలుపు , మరియు ఎరుపు రంగుల్లో  లభించు చున్నవి .  ఆవు మూత్రము రంగులో ఉన్న రత్నమును ధరించుట వలన రాజ భోగములు కలుగుట యే కాక గొప్ప అదృష్ట వంతు లగుదురు. కాంతి విహీనముగా ఉన్న రత్నమును ధరించుట వలన   దరిద్రమును అనుభవింతురు . మంచి రత్నమును ఎంపిక చేసుకొని ధరించుట వలన గొప్ప ఫలితములు పొందగలరు .. ఈ రత్న ధారణ వలన పోయిన ధనమును , ఆస్తులను , తిరిగి పొందు టకు అవకాశ మున్నది . ఆస్తి తగాదాలు , కోర్టు వ్యవహారముల యందు విజయము వరించును .భార్యా భర్తల మధ్య అపోహలు ఉంటే తొలగి అన్యోన్య  దాంపత్య జీవితమును గడిపెదరు .

నవ గ్రహాల లో రాహువు 4 సంఖ్యకు అధిపతి.
4, 13, 22, ౩1 తేదీలలో పుట్టినవారు ఆరుద్ర , స్వాతి , శతభిషం నక్షత్రము లలో జన్మించినవారు , ఈ రత్నమును ధరించుట యోగ్యము .

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...