2013-09-26

ముత్యము ( pearl)


చంద్రుడు  జల స్వరూపుడని  ఇంతకు ముందు శీర్షిక లలో తెలుసు కొన్నాము . ఈ ముత్యాలు నీటి వలన ఏర్పడు చున్నవి . చంద్రుని స్వరూప మైన ముత్యాలు తొమ్మిది రకములు గా ఏర్పడు చున్నవి.

మేఘము ల యందునూ , పాముల శిరస్సు నందు, చేపల శిరస్సు నందు, ఏనుగు శిరస్సు నందు, చెరకు గడల లోను  శంఖము ల యందు సముద్రపు ఒడ్డున ఉండు ఆల్చిప్పల యందు అడవి పంది కోరల యందు, వెదురు బొంగుల యందు ఏర్పడు చున్నవి.

ప్రస్తుత కాలములో ప్రపంచము లో కొన్ని ప్రదేశము లలో ఈ ముత్యాలను విరివిగా పండించుట జరుగు చున్నది. . అనాది నుండి  నవ రత్నము లను భారతీయులు ధరించుట ఆచారముగా ఉన్నది . స్త్రీలు ముత్యాల హారము లు ధరించుట  .. మగవారు ముత్యాల ఉంగరము లు ధరించుట మనకు తెలుసు.

సర్పము ల శిరస్సు  పై పుట్టు ముత్యాలు కొద్ది ఎరుపు రంగును పోలి యుండును . ఈ రకమైన ముత్యము లను ధరించుట వలన విష దోషములు హరింప బడును . వెదురు బొంగులో పుట్టు ముత్యము లు తెల్లగా ఉండును.
ఈ ముత్యము లను ధరించుట వలన జన వశీకరణము కలుగును . చేపల తలపై నుండు ముత్యము ను ధరించుట వలన శరీర ఉష్ణోగ్రత కంట్రోల్ లో ఉండును .( కొందరి శరీరము చెమట పట్టక పొడిగా ఉందును. అట్టి వారికి ఈ ముత్యము ను ధరించుట ఎంతో ఉప యుక్తము ). ముత్యపు చిప్పల లో పుట్టు ముత్యము ను ధరించుట వలన లోక వ్యవహారము ల యందు జయము కలుగును . ఇది సకల శుభము లను కలుగ జేయు నని మహర్షి వచనము .

సంఖ్యా శాస్త్రము ప్రకారము చంద్రుని సంఖ్య 2
2, 11, 20, 29 తేదీ లలో జన్మించిన వారు  రోహిణీ , హస్త , శ్రవణం నక్షత్రము లలో జన్మించిన వారు మరియు కర్కాటక రాశి యందు , కర్కాటక లగ్నము నందు జన్మించిన వారు ముత్యము లు ధరించుట వలన సకల శుభము లు పొందగలరు .   

ముత్యము ను గో మూత్రము లో కొద్దిగా ఉప్పు కలిపి నాన బెట్టి  బైటకు తీసిన తరువాత  వరి ఉక తో తోమాలి.
అలా చేసి నపుడు పగలక యున్న అది మంచి ముత్యము .

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...