2013-09-19

వజ్రము (diamond)


వజ్రము నకు భారతదేశములో విశేష చరిత్ర ఉన్నది. పూర్వకాలములో మహారాజులు , రాజ్యాధినేతలు వీటిని విలువైన సంపద గానూ , హోదాకు చిహ్నము గానూ భావించేవారు. ప్రస్తుత కాలములోనూ వజ్రములు ఎంతో విలువ కలిగినవి అతి ఖరీదైనవి . భారత దేశములో ఒకప్పుడు ఉన్నటువంటి కోహినూర్ వజ్రము ప్రపంచ ప్రసిద్ది గాంచినది .

వజ్రము నకు సకల శాస్త్ర పారంగతుడు , సకల భోగ ప్రదాత అయిన శుక్రుడు అధిపతి ..నవ రత్నము లలో అతి ప్రసిద్ది పొందినది. అతి విలువైనది వజ్రము. .వజ్రములు ప్రపంచములో కొన్ని ప్రాంతములలో దొరుకు చున్నవి .వజ్రములు  తెలుపు, ఉదయించే సూర్యకాంతి వాలె కొద్ది ఎరుపు వర్ణము , కొంచెం పచ్చ రంగులోనూ , నలుపు రంగుల్లో ఉండును. సాన పట్టిన తరువాత వజ్రమును పోల్చుట కష్టము . తెలుపు రంగు వజ్రము ధరించుట ఉత్తమము.

వజ్రము పగుల కొట్టిన పగలదు . రంపంతో కోసిననూ , ఆకురాయి తో గీసిననూ గీతలు పడకుండా ఉన్న వజ్రము మంచిది. వజ్రమును నీటిలో వేసిన మునగదు. కాంతివంతమైన బీటలు లేని వజ్రములను ధరించుట వలన నిత్య సంతోషములను అనుభవింతురు .
సంఖ్య శాస్త్రము ప్రకారము శుక్రుడు సంఖ్య 6
6, 15, 24 తేదీలలో జన్మించిన వారు భరణి , పుబ్బ , పూర్వాషాడ నక్షత్రములలో పుట్టిన వారు వృషభ రాశి, తుల రాశులలో పుట్టిన వారు వజ్రమును ధరించుట వలన జీవితము సుఖప్రదముగా దాంపత్యము అన్యోన్యత గలిగి ఆనందమయముగా ఉందురు.

ఉదయించే సూర్యుని కాంతి వలె ఉండే వజ్రమును ధరించుట వలన రాజ్యాధికారము కలుగును . ఉన్నత పదవులలో రాణింతురు.. కొంచెం బంగారు వర్ణములో ఉన్న వజ్రమును ధరించుట వలన వ్యాపారములో విశేష అభివృద్ది కలుగును . సంగీతము , సాహిత్యము , గాయకులు మరియు  కళారంగములలో ఉన్నవారికి విశేష యోగము కలుగును . వివాహము కాని వారు వజ్రము ధరించుట వలన జాతక దోషములు తొలగి వివాహము జరుగును.

No comments:

మేషరాశి

ద్వాదశ రాశులను బట్టి మానవుని జీవిత విశేషములను , మానవుల యొక్క గుణ గణాలను తెలుసు కోవచ్చని జ్యోతిష్య శాస్త్రవేత్తలు తెల్పి యున్నారు . మ...