ఏలిన నాటి శని ప్రభావమును గురించి ఇంతకు ముందు
కొంత తెలుసు కొన్నాము.
తెలుగు అనే పదం లో మొదట ‘’తె ‘’ అను అక్షరం వస్తుంది . ఇది
విశాఖ నక్షత్రము తులా రాశికి చెందినది .
ఎవరికైనా ఏలిన నాటి శని జరుగుచున్నప్పుడు
ఫలితములు చాలా ఇబ్బందికరముగా ఉంటాయి .అది వ్యక్తికైనా , కుంటుంబం కైనా
వ్యవస్తలకైనా లేక సంస్థలకైనా లేక ప్రాంతాలకైనా ఫలితము ఒకేలా ఉంటుంది .
సాధారణముగా ఏలిననాటి శని జరుగు చున్నప్పుడు
ఆర్ధిక పరిస్థితులు బాగా లేకపోవడం , కుటుంబములో గొడవలు , యాక్సిడెంట్లు జరగడం , అన్నదమ్ములు
విడిపోవడం, కుటుంబం చిన్నాభిన్నం అవడం ,
ఆత్మీయులు గానీ కుటుంబ పెద్దలు గానీ మరణించడం లాంటి అనేక దుష్పరిణామాలు జరుగుతాయి
.
ఏలిననాటి శని జరుగు చున్నప్పుడు హక్కులకై
పోరాటాలు , ఉద్యమాలు , ఆత్మగౌరవ నినాదాలు బ్రతుకు పోరాటాలు జరుగుతుంటాయి .
ఆంధ్ర రాష్ట్ర అవతరణ అనేది 01 . 10 . 1952 లో
జరిగింది . అప్పటికి శని తులారాశి సంచారములో ఉన్నాడు . అంటే జన్మ స్థానము నందు
శనిగ్రహ సంచారం అన్న మాట . తెలుగు జాతికి ఏలిన నాటి శని జరుగుచు ఉన్నప్పుడు
మద్రాసు రాష్టములో ఉన్న మనకు ఆత్మగౌరవం కోసం పోరాటం మొదలైనది . మహనీయుడు శ్రీ
పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజలకు గుర్తింపు కావాలనే ఉద్దేశ్యముతో ఆమరణ నిరాహార
దీక్ష చేసాడు . అనతరము తెలుగు వారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది . కానీ
రాజధానిని కోల్పోవలసి వచ్చినది . ఏలిన నాటి శని వదలిన తరువాత తెలంగాణా ప్రాంతాన్ని
మనలో కలపడం జరిగింది .
ఏలిన నాటి శని ఒకసారి వచ్చిందంటే మరలా రావడానికి
౩౦ సంవత్సరాలు పడుతుంది .
ఈ లెక్కన చూసుకొంటే 1982 – 198౩ సంవత్సరములో మరలా ఏలిన నాటి శని వచ్చింది .
ఈ సమయములో తెలుగు వారి కొరకు ప్రత్యేక పార్టీ
ఏర్పాటు అయ్యింది . తెలుగు దేశం ( ప్రాంతీయ పార్టీ ) అప్పటి వరకు మర్రి చెట్టులా
పాతుకు పోయిన కాంగ్రెస్ పార్టీని కూకటి వేళ్ళతో సహా పెకిలించి వేసింది . పరిపాలనలో
ఒక నూతన అధ్యాయము మొదలైంది .
ఏ రాశికైనా ఏలిన నాటి శని గురించి తెలుసుకోవాలని
అనుకొంటే జన్మ రాశికి ఇరువైపులా ఉన్న రాశులలో శని సంచారము చేయు సమయమును కూడా లెక్క
వేయాలి . ఎందుకంటే శని ఒక్కొక్క రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటాడు . ౩ రాశులలో
కలిపి ఏడున్నర సంవత్సరాలు సంచారము చేస్తాడు కదా . దీనినే ఏలిననాటి శని అని అంటారు.మన తెలుగు వారికి ( తెలుగు రాష్ట్రం లేక తెలుగు
జాతి ) . ప్రత్యేక రాష్ట్రము ఏర్పడిన నాటి
నుండి చూస్తే మూడవ సారి ఏలిన నాటి శని ప్రస్తుతం జరుగు చున్నది .
ఈ సమయాన అనగా సుమారు 2009 సంవత్సరము లో రాజు
మరణించాడు . ( చీప్ మినిస్టర్ రాజశేఖర్ రెడ్డి ) తదనంతరం ఉద్యమాలు ప్రభావము
ప్రారంభం అవడం ప్రాంతీయ విద్వేషాలు పెరుగు చున్నాయి . అన్నదమ్ములా కలసి ఉండాల్సిన
మనలో ఈర్ష్య , అసూయ , ద్వేషాలు పెరిగి పోయాయి . ప్రభుత్వ పాలన స్తంభించింది . (శని సేవకుల
సూచిస్తాడు . ) ఉద్యోగుల దీక్షలు ప్రజా ఉద్యమాలతో రాష్టం అంతా అయోమయంగా
తయారయ్యింది . తుదకు దేశాది నేతలు విభజన నిర్ణయము తీసుకోవడము తెలుగు జాతి , తెలుగు
ప్రజలు ముక్కలయ్యే స్థితి వచ్చింది . 195౩ లానే 201౩ లో మెజార్టీ ప్రజలు రాజధాని
నగరమును కోల్పోవలసి వస్తుంది . ఇది భాధా కరమైన విషయమే. 2014 నవంబరు వరకు జన్మశని
ఉంటుంది . ఈ లోగా విభజన జరగక పొతే రాష్ట్రం సమైఖ్యంగా ఉండే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి
.
. .
No comments:
Post a Comment